జనవరిలో 7 శాతం పెరిగిన బజాజ్ ఆటో బైక్ సేల్స్

Pulsar 200NS
భారతదేశంలో ద్విచక్ర వాహనాల తయారీలో ద్వితీయ స్థానంలో ఉన్న బజాజ్ ఆటో కొత్త సంవత్సరాన్ని సరికొత్త రికార్డుతో ప్రారంభించింది. బజాజ్ ఆటో నెలవారీ అమ్మకాలలో ఇదివరెకన్నడూ లేని విధంగా, గడచిన జనవరి నెలలో 6.83 శాతం వృద్ధిని నమోదు చేసుకొని అత్యధికంగా 2,94,439 మోటార్‌‌సైకిళ్లను విక్రయించింది.

గడచిన సంవత్సరంలో ఇదే నెలలో కంపెనీ మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాలు 2,75,622 యూనిట్లుగా ఉన్నట్లు బజాజ్ ఆటో లిమిటె ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సమయంలో కంపెనీ ఎగుమతులు 13.01 శాతం వృద్ధి చెంది 1,16,996 యూనిట్లుగా నమోదయ్యాయి. జనవరి 2011లో ఇవి 1,03,526 యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది.

ఇకపోతే త్రిచక్ర వాహన విభాగంలో అమ్మకాలు 14.42 శాతం వృద్ధి చెంది 43,436 యూనిట్లుగా నమోదయ్యాయని, క్రితం సంవత్సరం ఇదే నెలలో ఈ అమ్మకాలు 37,961 యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. మొత్తమ్మీద కంపెనీ మొత్తం అమ్మకాలు 3,13,583 యూనిట్ల నుండి 3,37,875 యూనిట్లకు పెరిగి 7.75 శాతం వృద్ధి నమోదు చేసుకున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, February 4, 2012, 12:22 [IST]
English summary
Bajaj Auto on Thursday reported 6.83 per cent increase in its motorcycle sales in January at 2,94,439 units, the highest ever for the month. The company had sold 2,75,622 units in the corresponding month last year, Bajaj Auto Ltd (BAL) said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+