అంతర్జాతీయ మార్కెట్లపై బజాజ్ ఆటో భారీ అంచనాలు

దేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో దేశీయ మార్కెట్ కన్నా అంతర్జాతీయ మార్కెట్‌కే ఎక్కువ ప్రధాన్యత ఇస్తోంది. రానున్న మూడేళ్లలో ఎగుమతుల ద్వారా 50 శాతం అమ్మకపు ఆదాయం నమోదు చేయాలనే లక్ష్యంతో విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేశామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.


ఇందులో భాగంగానే, లాటిన్‌ అమెరికా, అర్జంటీనా, చీలీ తదితర విదేశీ మార్కెట్లలోకి తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నామని బజాజ్ ఆటో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌ రవికుమార్‌ వెల్లడించారు. గత మూడేళ్లుగా గమనిస్తే కంపెనీ ఎగుమతులు రెండింతలు వృద్ధి చెందాయని ఆయన తెలిపారు.

ప్రస్తుతం బజాజ్ ఆటో ఉత్పత్తి చేస్తున్న మోటార్‌‌సైకిళ్లలో 35 శాతం అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. 2011-12 వార్షిక నివేదిక ప్రకారం బజాజ్ ఆటో లిమిటెడ్ ఎగుమతులు 31 శాతం వృద్ధిని సాధించాయి. ఈ సమయంలో కంపెనీ మొత్తం 15.8 లక్షల వాహనాలు ఎగుమతి చేసింది. ఈ ఎగుమతుల ద్వారా కంపెనీ ఆదాయం 35 శాతం వృద్ధిని సాధించి రూ.6,604 కోట్లుగా నమోదైంది. బజాజ్ ఆటో విదేశాలకు ఎగుమతి చేస్తున్న మోడళ్లలో బజాజ్ పల్సర్‌ 135 మోటార్‌సైకిల్‌కు అత్యంత క్రేజ్ ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, July 23, 2012, 12:29 [IST]
English summary
Bajaj Auto Ltd is expecting exports to account for 50 per cent of its total sales in the next three years, as it plans to enter new markets in Latin America such as Argentina and Chile.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+