మరోసారి రూ.8,000 పెరిగిన కెటిఎమ్ డ్యూక్ 200 ధర

తాజా పెంపుతో బజాజ్ కెటిఎమ్ డ్యూక్ 200 బైక్ ధర రూ.1.29 (ఎక్స్-షోరూమ్) లక్షలకు చేరింది. అయినప్పటికీ ధర పరంగా చూసుకుంటే ఇది ఇప్పటికీ హోండా అందిస్తున్న సిబిఆర్250ఆర్ స్పోర్ట్స్ బైక్‌కు గట్టి పోటీగా నిలుస్తుంది. దేశీయ మార్కెట్లో హోండా సిబిఆర్250ఆర్ ధర 1.50 లక్షలకు పైగా ఉంది. అలాగే, హోండా సిబిఆర్150ఆర్‌తో పోల్చుకుంటే ధర పరంగా కెటిఎమ్ డ్యూక్ 200 ఎక్కువగా ఉన్నప్పటికీ, పెర్ఫామెన్స్ పరంగా భేషుగ్గా ఉండనుంది.
కెటిఎమ్ డ్యూక్ 200 బైక్ విషయానికి వస్తే. ఇందులో 200సీసీ, 4-వాల్వ్ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూలింగ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ డిఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 25 బిహెచ్‌పిల శక్తిని, 20 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 9.01 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 136 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇంకా ఇందులో ఎలక్ట్రిక్ స్టార్ట్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 10.5 లీటరల్ ఫ్యూయెల్ ట్యాంక్, ఓ (O) రింగ్ చైన్, 170 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








