బజాజ్ నుంచి నాలుగు గేర్లు కలిగిన డిస్కవరీ 100సీసీ బైక్

ఇప్పటి వరకూ 5-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (ఐదు గేర్లతో కూడిన గేర్ బాక్స్)తో లభిస్తున్న బజాజ్ డిస్కవర్ 100సీసీ మోటార్‌సైకిల్‌లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. దేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన కంపెనీ విడుదల చేసిన ఈ సరికొత్త బజాజ్ డిస్కవర్ 100సీసీ బైక్ కేవలం 4-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (నాలుగు గేర్లతో కూడిన గేర్ బాక్స్)తో మాత్రమే లభిస్తుంది.

కొత్త డిస్కవర్ 100సీసీ మోటార్‌సైకిల్‌‌లో కంపెనీ డిటిఎస్‌ఐ టెక్నాలజీతో కూడిన ఇంజన్‌ను ఉపయోగించింది. ఇది ఇటు పెర్ఫామెన్స్‌తో అటు మెయింటినెన్స్ పరంగా బడ్జెట్‌లోనే ఉండనుంది. ప్రస్తుతం పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న తరుణంలో ఇలాంటి అధిక మైలేజ్‌నిచ్చే బడ్జెట్ బైక్‌ల వైపే కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. సెల్ఫ్ స్టార్ట్‌, పాస్ స్విచ్, నైట్రాక్స్ సస్పెన్షన్‌లతో లభించే ఈ 4-గేర్ బజాజ్ డిస్కవర్ 100సీసీ బైక్ ఎక్స్-షోరూమ్, హైదరాబాద్ ధర రూ.43,971 గా ఉంది.

కొత్త డిస్కవర్ 100సీసీ బైక్ బ్లాక్‌ గోల్డ్‌, బ్లాక్‌ బ్లూ, బ్లాక్‌ రెడ్‌, ఫ్లేమ్‌ రెడ్‌క్రాస్‌‌తో పాటుగా మల్టీ కలర్‌ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. రాష్ట్రంలోని అన్ని బజాజ్‌ డీలర్‌షిప్‌లలో ఈ కొత్త బైక్ లభ్యం కానుంది. కొత్త డిస్కవర్ 100సీసీ బైక్ కోసం ఎక్సేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నామని, ఏదైనా పాత బజాజ్ ద్విచక్ర వాహానాన్ని తీసుకువచ్చి ఎక్సేంజ్ ఆఫర్‌లో సరమైన ధరకే ఈ కొత్త డిస్కవర్‌ను పొందవచ్చని కంపెనీ పేర్కొంది.

అంతేకాకుండా, తమ ఫైనాన్స్ విభాగం బజాజ్ ఫైనాన్స్ కేవలం రూ.8,999 డౌన్‌ పేమెంట్‌‌తో 8.99 శాతం వడ్డీ రేటుకే ఈ బైక్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. కొత్త డిస్కవర్ 100సీసీ బైక్ సాధారణ పరిస్థితుల్లో లీటర్ పెట్రోలుకు 75 కి.మీ. మైలేజీని, ప్రామాణిక పరిస్థితుల్లో లీటరు పెట్రోలుకు 91 కి.మీ.వరకు మైలేజీనిస్తుందని బజాజ్ ఆటో జోనల్ మేనేజర్ అమిత్ పవార్ తెలిపారు.

రాష్ట్ర మార్కెట్లో బజాజ్ ఆటోకు 23 శాతం మార్కెట్ వాటా ఉందని, కొత్త డిస్కవర్ 100తో ఇది కొంత పెరుగుతుందని భావిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నెలకు 8,000 డిస్కవర్ బైకులను విక్రయిస్తామని, మొత్తంగా 16,000 ద్విచక్ర వాహనాలను అమ్ముతామని ఆయన వెల్లడించారు. కాగా.. బజాజ్ ఆటో తాజాగా మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త పల్సర్ 200ఎన్ఎస్ మోడల్‌ను జూలై-ఆగస్టులో రాష్ట్ర మార్కెట్లో ప్రవేశపెట్టనున్నామని అమిత్ పవార్ వెల్లడించారు.

More from DriveSpark

Article Published On: Saturday, June 9, 2012, 12:21 [IST]
English summary
India's second largest motorcycle manufacturer Bajaj Auto Ltd has launched a 4-speed transmission system Discover 100cc bike in Hyderabad. Powered by 100cc DTS-i engine the new Bajaj Discover is priced at Rs 43,971 ex-showroom, Hyderabad.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+