మరికాసేపట్లో విడుదల కానున్న సరికొత్త డిస్కవర్..

కొత్త పల్సర్‌ విడుదలతో బైక్ ప్రియులకు ఓ సరికొత్త అద్భుతాన్ని పరిచయం చేసిన బజాజ్ ఆటో మరో సరికొత్త మోడల్‌తో నేడు మార్కెట్లో విడుదల చేయనుంది. బజాజ్ ఆటో అందిస్తున్న డిస్కవర్ వేరియంట్‌లో ఇదివరకెన్నడూ చూడని విధంగా, ఈ సెగ్మెంట్లో మరెవరూ ఆఫర్ చేయని ఫీచర్లతో డిజైన్ చేసిన అప్‌గ్రేడెడ్ డిస్కవర్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ నేడు మార్కెట్లోకి విడుదల చేయనుంది.

బజాజ్ ఆటో కొత్తగా విడుదల చేయనున్న 2012 డిస్కవర్‌లో 125సీసీ ఇంజన్ వేరియంట్ అయి ఉండొచ్చని అంచనా. ఇందులో గ్యాస్ ఫిల్డ్ మోనషాక్ అబ్జార్వర్ (కొత్త పల్సర్, హోండా యునికార్న్ మోడళ్లలో ఉపయోగించినట్లుగా సింగిల్ సెంటర్ సస్పెన్షన్)ను ఉపయోగించారు. 125సీసీ సెగ్మెంట్లో ఇదే మొట్టమొదటిది. అలాగే, ఇందులో రీడిజైన్ చేయబడిన ఫ్యూయెల్ ట్యాంక్ మరో ప్రత్యకతగా ఉండనుంది.

ఫ్రంట్ సస్పెన్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్‌లు యధావిధిగా ఉండనున్నాయి. రీడిజైన్ చేయబడిన సైలెన్సర్, సరికొత్త ఇండికేటర్స్, హెక్సాగనల్ షేప్‌లో ఉండే సరికొత్త రియర్ వ్యూ మిర్రర్స్ (సైడ్ మిర్రర్స్), రీడిజైన్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ (స్పీడోమీటర్ కన్సోల్), శక్తివంతమైన హెడ్‌లైట్ వంటి అనేక మార్పులు సరికొత్త డిస్కవర్‌లో ఉండనున్నాయి. మొత్తమ్మీద ఓ సరికొత్త రూపంతో, బజాజ్ ప్రియులను ఆకట్టుకునేందుకు డిస్కవర్ మరికాసేపట్లో మార్కెట్లోకి రానుంది.

More from DriveSpark

Article Published On: Monday, May 14, 2012, 12:01 [IST]
English summary
India's second largest two-wheeler manufacturer Bajaj Auto is ready to launch the next generation, all new Bajaj Discover Today.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+