పల్సర్ 220ఎస్ఎఫ్ ఉత్పత్తిని బజాజ్ ఆటో నిలిపివేసిందా..?
అదేంటి బజాజ్‌కు లక్కీ ఛార్మ్ అయిన పల్సర్‌ను కంపెనీ నిలిపేవిసిందా అని కంగారు పడకండి. బజాజ్ ఆటో మొత్తం పల్సర్ బ్రాండ్ ఉత్పత్తిని నిలిపివేయలేదు, అందులో కేవలం ఒక్క వేరియంట్ ఉత్పత్తిని మాత్రమే నిలిపివేసింది. మరికొద్ది రోజుల్లో కొత్త పల్సర్ 200ఎన్ఎస్ మార్కెట్లలోకి రానున్న నేపథ్యంలో, బజాజ్ అందిస్తున్న పల్సర్ 220ఎస్ఎఫ్ (స్ట్రీట్ ఫైటర్) వేరియంట్‌ను కంపెనీ చడిచప్పుడు లేకుండా నిలిపివేసింది.
అయితే, దీనికి సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. కానీ కంపెనీ వెబ్‌సైట్ నుండి ఈ మోడల్‌ను తొలగించటం గమనార్హం. పల్సర్ 220లో టాప్ ఎండ్ వేరింయట్ అయిన 220 డిటిఎస్ఐ ఎఫ్ మాత్రం ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌తో యధావిథిగా మార్కెట్లో కొనసాగుతుంది. ఈ మోడల్ కన్నా పల్సర్ 220ఎస్ఎఫ్ సుమారు రూ.3,000 మాత్రమే తక్కువ ధరను కలిగి ఉంటుంది.
కొనుగోలుదారులు ఎక్కువగా కాస్తంత ఖరీదైన ఫర్వాలేదని పల్సర్ 220 డిటిఎస్ఐ ఎఫ్ మోడల్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారని డీలర్లు చెబుతున్నారు. పల్సర్ 220ఎస్ఎఫ్ మోడల్ అమ్మకాలు తక్కువగా ఉండటం, త్వరలో కొత్త పల్సర్ 200ఎన్ఎస్ (నేక్‌డ్ స్పోర్ట్స్) మార్కెట్లోకి రానుండటంతో ఈ మోడల్ ఉత్పత్తిని బజాజ్ ఆటో నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెలలోనే కొత్త పల్సర్ 200ఎన్ఎస్ మార్కెట్లో వాణిజ్య పరంగా లభ్యం కానుంది.
ప్రస్తం బజాజ్ ఆటో 135ఎల్ఎస్, 150 డిటిఎస్ఐ, 180 డిటిఎస్ఐ, 220 డిటిఎస్ఐ ఎఫ్ వేరియంట్లలో మాత్రమే పల్సర్ బ్రాండ్‌ను అందిస్తుంది. ఇది కాకుండా, డిస్కవర్, ప్లాటినా, అవెంజర్, నిన్జా, కెటిమ్ డ్యూక్ 200 మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తుంది.


Click it and Unblock the Notifications








