సరికొత్త 2012 పల్సర్‌ను విడుదల చేసిన బజాజ్ ఆటో
ఎన్నాళ్లుగానో బైక్ లవర్స్‌ను ఊరిస్తూ వచ్చిన కొత్త 2012 బజాజ్ పల్సర్ ఎట్టకేలకు తన పరదాలను తొలగించుకుంది. దేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న పల్సర్ బ్రాండ్ స్పోర్ట్స్ బైక్‌లో పదేళ్ల తర్వాత ఓ సరికొత్త ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కొత్త 2012 పల్సర్‌ను కంపెనీ నేడు మార్కెట్లో ఆవిష్కరించింది.
'పల్సర్ 200ఎన్ఎస్' (నేక్‌డ్ స్పోర్ట్స్) పేరుతో విడుదలైన ఈ స్పోర్ట్స్ బైక్‌లో 199.5సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9500 ఆర్‌పిఎమ్ వద్ద 23.4 బిహెచ్‌పిల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 1.86 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో తొలిసారిగా ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీని (ప్రస్తుతం ఉన్న పల్సర్ బైక్‌ల కన్నా ఒక స్పార్క్ ప్లగ్ ఎక్కువ) ఉపయోగించడం జరిగింది. పల్సర్ 200ఎన్ఎస్ బైక్ లీటర్ పెట్రోల్‌కు 58 కి.మీ. మైలేజీనిస్తుంది.


Click it and Unblock the Notifications









