స్ప్లెండర్ వేస్ట్.. డిస్కవర్ బెస్ట్..: బజాజ్ కొత్త టివిసి

ఈ ప్రకటనలో నేరుగా హీరో స్ప్లెండర్ బైక్‌ను తక్కువ చేసి చూపిస్తూ, డిస్కవర్ 125సీసీ బైక్‌ను ఎక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసింది. బజాజ్ ఆటో విడుదల చేసిన కొత్త టెలివిజన్ వాణిజ్య ప్రకటనలో హీరో స్ప్లెండర్ బైక్ సాధారణ రైడ్ కోరుకునే వారికోసమేనని, పెర్ఫామెన్స్ విషయంలో సర్దుకుపోయో వారి కోసమేనన్నట్లుగా కంపెనీ చూపించింది.
అధిక పవర్, పెర్ఫామెన్స్ కావాలనుకునే వారు డిస్కవర్ 125సీసీ బైక్‌ను కోరుకుంటారని కంపనీ చిత్రీకరించింది. ఈ ప్రకటన గురించి సింపుల్‌గా చెప్పాలంటే, స్ప్లెండర్ కేవలం నడుస్తుందని, డిస్కవర్ 125 పరుగులు తీస్తుందని తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ హీరోకు బజాజ్ ఆటో చురకలంటించింది.
డిస్కవర్ 125సీసీ బైక్.. యే చల్తా నహీ.. దౌడ్‌తా హై అనే థీమ్ నేపథ్యంలో ఈ ప్రకటన సాగుతోంది. మరి ఈ ప్రకటనపై హీరో మోటోకార్ప్ ఎలా స్పందిస్తుందో లేక బజాజ్ ప్రకటనకు కౌంటర్‌గా హీరో ఏదైనా సరికొత్త కాన్సెప్ట్‌తో కూడిన ప్రకటనను విడుదల చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








