మే 2012లో స్వల్పంగా పెరిగిన బజాజ్ బైక్ సేల్స్

దేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్ ఎంతో ఆర్భాటంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన కొత్త పల్సర్‌ను మార్కెట్లో విడుదల చేయటంలో జాప్యం చేయటం కారణంగా కంపెనీ అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నాయి. కొత్త పల్సర్ 200ఎన్ఎస్ మోడల్‌పై ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ ఉండటం, ఈ బైక్‌నే కొనుగోలు చేయాలని కొనుగోదాలుదారులు వేచి ఉండటంతో మే 2012 నెలలో బజాజ్ ఆటో అమ్మకాలు ఆశించినంతగా సాగలేదు.

Pulsar 200NS

అయితే, ఏదేమైనప్పటికీ ఈ నెలలో కొత్త పల్సర్ మార్కెట్లోకి వస్తుండటం, అలాగే బజాజ్ ఆటో ఆవిష్కరించిన స్పోర్టీ స్టయిల్ డిస్కవర్ 125సీసీ బైక్‌ను కూడా త్వరలోనే మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తుండటంతో రానున్న నెలల్లో ప్రోత్సాహకరమైన అమ్మకాలను నమోదు చేసుకోగలమని బజాజ్ ఆటో అంచనా వేస్తుంది. కాగా.. బజాజ్‌ ఆటో గడచిన మే నెలలో 3,21,922 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించి, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే కేవలం 1 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసుకుంది.

మే 2011లో బజాజ్ ఆటో మొత్తం 3,17,989 యూనిట్ల మోటార్‌సైకిళ్లను మాత్రమే విక్రయించింది. అలాగే, గడచిన నెలలో ఎగుమతులు కూడా స్వల్పంగా పెరిగాయి. ఈ సమయంలో ఎగుమతులు మూడు శాతం పెరిగి 1,30,573 యూనిట్లుగా నమోదు కాగా, అంతకు ముందు ఏడాది ఇవి 1,26,818 యూనిట్లుగా ఉన్నాయి. ఇక కంపెనీ విక్రయిస్తున్న వాణిజ్య విషయాలకు వస్తే, గడచిన మే నెలలో కంపెనీ మొత్తం 30,297 యూనిట్లు విక్రయించగా, గత ఏడాది ఇదే కాలంలో 40,860 యూనిట్లు విక్రయించింది. అమ్మకాల్లో 26 శాతం తగ్గుదలను నమోదు చేసింది. మొత్తం అమ్మకాల విషయానికి వస్తే గత నెల 3,52,219 యూనిట్లు విక్రయించగా గత ఏడాది ఇదే నెలలో 3,58,849 యూనిట్లు విక్రయించింది. గత ఏడాదితో పోల్చుకుంటే అమ్మకాల్లో రెండు శాతం తగ్గుదలను నమోదు చేసింది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 6, 2012, 10:11 [IST]
English summary
The country's second largest two-wheeler maker Bajaj Auto reported 1.23 per cent increase in motorcycle sales in May at 3,21,922 units. The company had sold 3,17,989 units in the corresponding month last year, Bajaj Auto Ltd (BAL) said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+