హీరో స్ప్లెండర్‌ను ఓవర్‌టేక్ చేసిన బజాజ్ డిస్కవర్

By Ravi

బజాజ్ ఆటో అందిస్తున్న చీప్ అండ్ బెస్ట్ బడ్జెట్ బైక్ 'డిస్కవర్' ద్విచక్ర వాహన సెగ్మెంట్లో ఓ అరుదైన రికార్డును సృష్టించింది. ఇప్పటి వరకూ ప్రపంచపు నెంబర్ వన్ బైక్‌గా ఉన్న హీరో స్ప్లెండర్ (అమ్మకాల పరంగా)ను వెనక్కు నెట్టి బజాజ్ డిస్కవర్ ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది. హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) అమ్మకాల పరంగా ప్రపంచపు అగ్రగామిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా స్ప్లెండర్ రికార్డును కలిగి ఉంది.


అయితే, ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోయింది. 2004లో పరిచయమైన బజాజ్ డిస్కవర్ గడచిన సెప్టెంబర్ నెలలో దేశీయంగా, అంతర్జాతీయంగా 1,22,968 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇదే సమయంలో 1,21,018 యూనిట్ల హీరో స్ప్లెండర్‌‍‌‌లు మాత్రమే విక్రయించబడ్డాయని బజాజ్ ఆటో ద్విచక్ర వాహన వ్యాపార విభాగం అధ్యక్షులు కె.శ్రీనివాస్ తెలిపారు. ఈ రికార్డ్ కేవలం సెప్టెంబర్ 2012 నెలకు మాత్రమే పరిమితం. మొత్తమ్మీద చూసుకుంటే, ఇప్పటికే హీరో స్ప్లెండర్ అమ్మకాలు అధికంగా ఉ్ననాయి.

దీనిపై హోరోమోటోకార్ప్ అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ఇప్పటికీ స్ప్లెండర్ అమ్మకాలు చురుకుగానే కొనసాగుతున్నాయని, ప్రస్తుతం ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ స్ప్లెండరేనని చెప్పారు. గడచిన సంవత్సరంలో మొత్తం 20 లక్షల స్ప్లెండర్లను విక్రయించామని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా వచ్చే సంవత్సరం జనవరి నెలలో ఓ కొత్త 100సీసీ బైక్‌ను మార్కెట్లోకి తెస్తామని, 100సీసీ కేటగిరి బైక్ సెగ్మెంట్లో కెల్లా ఇదే అత్యంత ఖరీదైన బైక్‌గా ఉండబోనుందని శ్రీనివాస్ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, October 4, 2012, 15:21 [IST]
English summary
Bajaj Auto on Wednesday claimed its entry-level bike Discover has displaced Splendor of rival Hero MotoCorp as the largest selling motorcycle in the world based on sales in September.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+