కెటిఎమ్ డ్యూక్ 200లో ఇప్పుడు సరికొత్త కలర్ ఆప్షన్స్

By Ravi

ఇండియాలో స్పోర్ట్స్ బైక్ ప్రియుల కోసం ఆస్ట్రియన్ స్పోర్ట్ బైక్‌ల తయారీ కంపెనీ కెటిఎమ్ మోటార్‌సైకిల్ మరియు దేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటోలు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన సరికొత్త ఆఫ్-రోడ్, అడ్వెంచరస్ బైక్ "కెటిఎమ్ డ్యూక్ 200" ఇప్పుడు సరికొత్త కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. బజాజ్-కెటిఎమ్ ఈ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసినప్పుడు కేవలం ఆరెంజ్ కలర్‌ను మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చాయి.

అయితే, విభిన్న రంగుల్లో ఈ బైక్‌ను కోరుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఇందులో మరిన్ని కలర్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. బజాజ్ కెటిఎమ్ డ్యూక్ 200 ఇప్పుడు తెలుపు, నలుపు రంగుల్లో కూడా లభ్యమవుతుంది. వైట్ కలర్ కెటిఎమ్ డ్యూక్ 200పై ఆరెంజ్ కలర్ డెకాల్స్ (గ్రాఫిక్స్/స్టిక్కర్స్), బ్లాక్ కలర్ కెటిఎమ్ డ్యూక్ 200పై వైట్ కలర్ డెకాల్స్‌ను కంపెనీ జోడించింది. ఈ క్రింది ఫోటోలో కొత్త కలర్స్‌తో కూడిన బజాజ్ కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్‌ను చూడొచ్చు.

బజాజ్ కెటిఎమ్ డ్యూక్ 200 ఫోటో గ్యాలరీ:

గడచిన జనవరి నెలలో బజాజ్ ఆటో ఈ సరికొత్త కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆఫ్-రోడ్ అడ్వెంచర్లకు, డ్రాగ్ రేసింగ్‌లకు, పవర్‌ఫుల్ బైక్ స్టంట్‌లకు అనువుగా ఉండే ఈ స్పోర్ట్స్ బైక్‌ను మంచి హ్యాండ్లింగ్‌ను కలిగి ఉంటుంది. కెటిఎమ్ డ్యూక్ 200 ఆఫ్-రోడ్ బైక్‌లో ఉపయోగించిన 200సీసీ ఇంజన్ గరిష్టంగా 25 బిహెచ్‌పిల శక్తిని, 20 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఇందులో ఎలక్ట్రిక్ స్టార్ట్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 10.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్, ఓ (O) రింగ్ చైన్, 170 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి. కెటిఎమ్ డ్యూక్ 200 ఎక్స్‌-షోరూమ్‌, హైదరాబాద్‌ ధర రూ.1.3 లక్షలుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 20, 2012, 16:52 [IST]
English summary
Bajaj has now rolled out two new colors for the KTM Duke 200. As seen from the image below, KTM Duke 200 is now offered in white and black. The white color Duke gets flashy orange and black decals and the Black Duke gets white and orange decals.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+