బజాజ్ నుంచి అత్యంత ఖరీదైన, అధునాతనమైన 100సీసీ బైక్

అయితే, దీని ధర మరియు ఇతర సాంకేతి విరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం బజాజ్ ఆటో 100సీసీ సెగ్మెంట్లో ప్లాటినా, డిస్కవర్ బ్రాండ్‌లను విక్రయిస్తోంది. మార్కెట్లో వీటి ధరలు రూ.38.990 నుంచి రూ.44,497 (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. గడచిన సెప్టెంబర్ నెలలో హీరో మోటోకార్ప్ నుంచి అత్యధికంగా అమ్మడువుతున్న 100సీసీ బైక్ స్ప్రెండర్‌ను తమ డిస్కవర్ అధిగమించిందని ఆయన గుర్తు చేశారు.
బజాజ్ ఆటో ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన సరికొత్త పల్సర్ 200ఎన్ఎస్ (నేక్డ్ స్పోర్ట్స్) స్పోర్ట్స్ బైక్, డిస్కవర్ 125ఎస్‌టి (స్పోర్ట్స్ టూరర్) బైక్‌లకు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. రిఫ్రెష్డ్ స్టయిలిష్ డిజైన్, స్పోర్టీ పెర్ఫామెన్స్‌లతో ఈ మోడళ్లు మార్కెట్లో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో బలహీనపడుతున్న 100సీసీ బైక్ సెగ్మెంట్‌ను కూడా పటిష్టం చేసుకునేందుకు బజాజ్ ఆటో సరికొత్త ఉత్పత్తితో ముందుకు రానుంది. జనవరి 2013లో ఇది మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications








