హైదరాబాద్ మార్కెట్లో పల్సర్ 200ఎన్ఎస్‌ని విడుదల చేసిన బజాజ్

దేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో గడచిన జనవరి నెలలో ప్రదర్శించిన సరికొత్త స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ ఇప్పుడు రాష్ట్ర మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చింది. బజాజ్ ఆటో తమ కొత్త పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్‌ను దశల వారీగా వివిధ మార్కెట్లలో విడుదల చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ మార్కెట్లో కూడా సరికొత్త పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది.

హైదరాబాద్ మార్కెట్లో బజాజ్ పల్సర్ 200ఎన్ఎల్ మోటార్‌సైకిల్ ధర రూ. 86,754 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. బజాజ్ ఆటో లిమిటెడ్ ఉపాధ్యక్షుడు (ద్విచక్ర వాహన విభాగం) కె. శ్రీనివాస్ ఈ కొత్త మోటార్‌సైకిల్‌ను రాష్ట్ర మార్కెట్లో విడుదల చేశారు. ఇందులో ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీతో కూడిన లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్, 4-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి 199.5సీసీ ఇంజన్‌ను ఉపయోగించామని, దీని వలన బైక్ పనితీరు అద్భుతంగా ఉండడమే కాకుండా తక్కువ వ్యర్థాలను విడుదల చేస్తుందని చెప్పారు.


పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్‌ను నడుపుతుంటే అసలైన స్పోర్ట్స్ బైక్‌ను నడుపుతున్న అనుభూతిని పొందుతారని, ఇంజన్ శబ్ధాన్ని తగ్గించేందుకు గాను, ఇంజిన్ ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచేందుకు ఇందులో లిక్విడ్ కూలింగ్‌ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

కొత్త బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్‌ విషయానికి వస్తే, ప్రపంచంలో మరెక్కడాని లేని విధంగా తొలిసారిగా ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీతో కూడిన లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్, 4-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి 199.5సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9500 ఆర్‌పిఎమ్ వద్ద 23.52 పిఎస్‌ల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 18.3 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

Bajaj Pulsar 200NS Photo Gallery:

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్‌ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది. కొత్త పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్ కేవలం 3.8 సెకండ్లలోనే 0 నుండి 60 కి.మీ. వేగాన్ని, అలాగే 9.8 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. పల్సర్ 200ఎన్ఎస్ గరిష్టంగా గంటకు 136 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది ఇంతటి శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉన్నప్పటికీ లీటర్ పెట్రోల్‌కు 58 కి.మీ (గంటకు 55 కి.మీ. వేగంతో వెళ్లినప్పుడు మాత్రమే) మైలేజీని కూడా ఇస్తుందని బజాజ్ ఆటో పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Saturday, July 28, 2012, 12:48 [IST]
English summary
Bajaj has opened bookings for its much awaited new Pulsar 200 NS in the south Indian state of Andhra Pradesh at Rs 86,754 (ex-showroom price). Andhra Pradesh is the fourth state in the country where bookings for the Pulsar 200 NS have been made available after Maharashtra and NCR region.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+