భారత్ బైక్ 'బాక్సర్ బిఎమ్ 150' కోసం బజాజ్ విలేజ్ క్యాంపైన్

భారత్ బైక్ అంటూ ఒకప్పుడు అత్యంత సక్సెస్ మోడల్ అయిన 100సీసీ బజాజ్ బాక్సర్‌ను అప్‌గ్రేడ్ చేసి మరింత శక్తివంతమైన ఇంజన్‌ను అమర్చి, ఆకర్షనీయమైన ఎక్స్టీరియర్స్, సరసమైన ధర (దాదాపు రూ.42,051, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కే బిఏఎల్ విడుదల చేసింది. అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ఈ మోడల్ అమ్మకాల పరంగా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం ఈ మోడల్‌కు సరైన ప్రచారం లేకపోవడం, కొనుగోలుదారుల్లో అవగాహన లేకపోవడమే.
ఈ నేపథ్యంలో భారత్ బైక్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బజాజ్ ఆటో లిమిటెడ్ పల్లె ప్రాంతాల్లో బాక్సర్ 150సీసీ బైక్‌తో రోడ్ షోలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం బజాజ్ ఆటో సుమారు ప్రతి నెలా 2500 నుండి 3000 బాక్సర్ బైక్‌లను విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ అమ్మకాలను మరింత పెంచేందుకు గానూ.. పల్లె మార్కెట్లలో ఓ డెమో వ్యాన్ ద్వారా బాక్సర్ బైక్ గురించి క్యాంపైన్ నిర్వహించి, టెస్ట్ డ్రైవ్‌లను ఆఫర్ చేస్తోంది.
తక్కువ ధరలో ఎక్కువ పవర్, మైలేజ్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని, గడచిన సెప్టెంబర్ నెలలో బజాజ్ ఆటో తన అప్‌గ్రేడెడ్ బాక్సర్ 150సీసీ బైక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








