100సీసీ బాక్సర్‌ను విడుదల చేసేందుకు బజాజ్ సన్నాహాలు

Boxer BM 150
దేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో హంగు ఆర్భాటం లేకుండా మార్కెట్లో పునఃప్రవేశపెట్టిన బాక్సర్ 150సీసీ వేరియంట్ అమ్మకాలు కంపెనీ ఆశించినట్లుగా సాగుతుండకపోవడంతో, ఈ మోడల్‌పై బజాజ్ ఆటో పెట్టుకున్న నమ్మకం నీరుగారి పోయింది. గ్రామీణ మార్కెట్లను గురిపెడుతూ, గతంలో ఉన్న బాక్సర్ బ్రాండ్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకుంటూ కంపెనీ కొత్త బాక్సర్ బిఎమ్ 150ను దేశీయ విపణిలో విడుదల చేసింది.

వాస్తవానికి గ్రామీణ రోడ్లకు శక్తివంతమైన మోటార్‌సైకిళ్లు అవసరమైనప్పటికీ, మైలేజ్ విషయంలో బాక్సర్ 150 పెద్దగా కొనుగోలుదారులను ఆకట్టుకోలేకపోయింది. ఈ రోడ్లకు పవర్‌తో పాటుగా మైలేజ్‌ని కూడా ఇచ్చే మోటార్‌సైకిళ్లు అవసరం. గతంలో బజాజ్ బాక్సర్ రూరల్ మార్కెట్లో మంచి క్రేజ్ ఉండేది. ఇప్పటికీ సెకండ్ బైక్ మార్కెట్లో పాత బాక్సర్ బైక్‌లకు ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో 100సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన బాక్సర్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ కసరత్తులు చేస్తుంది.

ఇప్పటికే, బజాజ్ వద్ద ఉన్న 100సీసీ ఇంజన్లను (బహుశా బజాజ్ డిస్కవర్ 100సీసీలో ఉపయోగిస్తున్నవి కావచ్చు) ఉపయోగించుకొని కొత్త బాక్సర్‌ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బజాజ్‌కు 100సీసీ సెగ్మెంట్లో ప్లాటినా, డిస్కవర్ బ్రాండ్‌లు ఉన్నాయి. ఇవి రెండు కూడా మార్కెట్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. 100సీసీ సెగ్మెంట్లో బజాజ్ తన హవాను కొనసాగించాలంటే, ఈ విభాగంలో మరిన్ని మోడళ్లను ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 21, 2012, 17:26 [IST]
English summary
The utility bike was revived by Bajaj Auto when it launched the Boxer 150. The new Boxer was attractive only in terms of its low price. Its rugged looks and lack of features meant it would not appeal to urban buyers. Although aimed at rural buyers, it appears that the Boxer 150 has not been very successful there too.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+