పల్సర్‌లో 350సీసీ వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్న బజాజ్!

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ మేకర్ కెటిఎమ్‌తో బజాజ్ చేతులు కలిపిన తర్వాత తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మరిన్ని ఉత్పత్తులను అందించి, గ్లోబల్ బైక్ మేకర్‌గా ఎదగాలని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో పల్సర్ 350సీసీ బైక్‌ను వచ్చేది ఆరంభంలో విడుదల చేయనున్నామని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ విడుదల సందర్భంగా సూచనప్రాయంగా తెలియజేశారు.
అయితే, ఇదే సమయంలో కెటిఎమ్ నుండి కూడా "డ్యూక్ 350" బైక్ మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే డ్యూక్ 200 విడుదలైన కొద్ది రోజులకే పల్సర్ 200ఎన్ఎస్ విడుదల కావడం పట్ల ఈ రెండు బైక్‌లు ఇంచు మించు ఒకేలా ఉన్నాయని అపోహలు వచ్చాయి. అంతేకాకుండా.. కెటిఎమ్ సంస్థ తమ మోటార్‌సైకిళ్లను బజాజ్ బ్రాండ్ క్రింద భారత్‌లో విక్రయించే ప్రయత్నం చేస్తోందన్న పుకార్లు కూడా ఉన్నాయి.
దీన్ని బట్టి చూస్తుంటే డ్యూక్ 350 ఆధారంగానే పల్సర్ 350 కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ.. ధర విషయంలో పల్సర్ 350 మాత్రం డ్యూక్ 350 కన్నా దిగువన ఉండనుంది. పల్సర్ 200ఎన్ఎస్‌లో ఉపయోగించిన ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీనే పల్సప్ 350లో కూడా ఉపయోగించనున్నారు. ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి సారిగా సింగిల్ సిలిండర్ ఇంజన్‌లో ఈ టెక్నాలజీని ఉపయోగించిన ఒక్క బజాజ్ ఆటోకే దక్కింది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో బైక్ ఇగ్నిషన్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.


Click it and Unblock the Notifications








