ఢిల్లీ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్‌

దేశీయ ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన కంపెనీ బజాజ్ ఆటో ఈ నెల ఆరంభంలో పూనే మార్కెట్లో కొత్త బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు తాజాగా దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా 2012 బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ బైక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త పల్సర్ 200ఎన్ఎస్ మోడల్‌ను ఒకేసారి దేశవ్యాప్తంగా విడుదల చేయకుండా, దశల వారీగా, తొలుత ఎంపిక చేసిన మార్కెట్లలో బజాజ్ అందిస్తోంది.

ఇందులో భాగంగానే తాజాగా ఈ మోడల్‌ను ఢిల్లీ మార్కెట్లో కంపెనీ విడుదల చేసింది. రాజధానిలో కొత్త బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్ ధరలు రూ.85,000 (ఎక్స్-షోరూమ్) గానూ, రూ.94,300 (ఆన్-రోడ్) గానూ ఉన్నాయి. ముందుగా వచ్చిన వాళ్లకే ముందు డెలివరీ (ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్) ప్రాతిపదిక డెలివరీలు అందజేస్తామని బజాజ్ ఆటో పేర్కొంది.


కొత్త బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్‌ విషయానికి వస్తే, ప్రపంచంలోనే ఎక్కడాని లేని విధంగా తొలిసారిగా ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీతో కూడిన లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్, 4-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి 199.5సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9500 ఆర్‌పిఎమ్ వద్ద 23.52 పిఎస్‌ల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 18.3 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

Bajaj Pulsar 200NS Photo Gallery:

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్‌ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది. కొత్త పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్ కేవలం 3.8 సెకండ్లలోనే 0 నుండి 60 కి.మీ. వేగాన్ని, అలాగే 9.8 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. పల్సర్ 200ఎన్ఎస్ గరిష్టంగా గంటకు 136 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది ఇంతటి శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉన్నప్పటికీ లీటర్ పెట్రోల్‌కు 58 కి.మీ (గంటకు 55 కి.మీ. వేగంతో వెళ్లినప్పుడు మాత్రమే) మైలేజీని కూడా ఇస్తుందని బజాజ్ ఆటో పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 28, 2012, 18:13 [IST]
English summary
According to the scheduled manner, Bajaj Auto has opened sales of its flagship Pulsar 200 NS in New Delhi. The Bajaj Pulsar 200 NS is available for bookings at Rs 85,000 (ex-showroom price) which will be transformed to an on-road price of Rs 94,300.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+