బిఎమ్‌డబ్ల్యూలో చేరనున్న పల్సర్ 200ఎన్ఎస్ డిజైనర్!
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గమనించారా..? ఇతని పేరు ఎడ్గర్ హెన్రిచ్. బజాజ్ ఆటో తాజాగా విడుదల చేసిన "పల్సర్ 200ఎన్ఎస్" స్పోర్ట్ బైక్‌ను డిజైన్ చేసింది ఈయనే. ప్రస్తుతం ఎడ్గర్‌కు జాక్‌పాట్ దొరికింది. బజాజ్ ఆటో లిమిటెడ్ కంపెనీలోని ప్రోడక్ట్ డిజైన్ విభాగానికి వైస్-ప్రెసిడెంట్ పనిచేసిన ఎడ్గర్ ఇప్పుడు ఆ పదవి రాజీనామా చేసి లగ్జరీ ఉత్పత్తులను తయారు చేసే బిఎమ్‌డబ్ల్యూ గ్రూపులో చేరాడు.
బిఎమ్‌డబ్ల్యూ చెందిన ద్విచక్ర వాహన విభాగం బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్‌లోని డిజైన్ స్టూడియో హెడ్‌గా ఎడ్గర్ ఎన్నికైనట్లు సమాచారం. అయితే, ఎడ్గర్‌కు బిఎమ్‌డబ్ల్యూ కొత్తేం కాదు. 1986వ సంవత్సరంలో బిఎమ్‌డబ్ల్యూలోనే ఎడ్గర్ తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత 2009లో బజాజ్‌లో చేరాడు. ఆర్ 1100 ఆర్, ఆర్‌టి, కె1200, ఆర్ 1150జిఎస్, ఆర్1200 జిఎస్ వంటి పాపులర్ మోడళ్లను ఈయన డిజైన్ చేశాడు.


Click it and Unblock the Notifications









