బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ధర రూ.90,000 మాత్రమే!

మొత్తానికి కొత్త పల్సర్ ధర ఎంతో తెలిసిపోయింది. దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్ మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో, పూణేలో ఇప్పటికే షోరూమ్‌లకు చేరిపోయిన పల్సర్ 200ఎన్ఎస్ కోసం అక్కడి డీలర్లు బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నారు. పూణేలో ఈ బైక్ ఆన్-రోడ్ ధర కేవలం రూ.90,000 మాత్రమే ఉన్నట్లుగానే సమాచారం.

కొత్త పల్సర్ తయారవుతోంది మహారాష్ట్రలోని ప్లాంటులోనే కావడంతో తొలుతగా పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్ పూణే, ముంబై మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. అనంతరం ఈ మోడల్‌ను దేశవ్యాప్తంగా కంపెనీ అందుబాటులోకి తీసుకువస్తుంది. పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్ వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదల చేయడానికి బజాజ్ ఆటో జాప్యం చేయడానికి కారణం, తమ భాగస్వామి కంపెనీ అందిస్తున్న కెటిఎమ్ డ్యూక్ 200 అని తెలుస్తోంది.


బజాజ్ ఆటో కెటిఎమ్ డ్యూక్ 200, పల్సర్ 200ఎన్ఎస్ మోడళ్ల దాదాపుగా ఒకే సమయంలో ఆవిష్కరించింది. అయితే, వీటిల్లో ముందుగా కెటిఎమ్ డ్యూక్ 200ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదే సమయంలో కొత్త పల్సర్‌ను మార్కెట్లో విడుదల చేసినట్లయితే, కొనుగోలుదారులు ఎక్కువగా కొత్త పల్సర్‌కే ప్రాధాన్యం ఇచ్చే వారు. ఈ సత్యాన్ని గ్రహించిన బజాజ్ ఆటో పల్సర్ 200ఎన్ఎస్‌ను సరిపడా స్టాక్ సిద్ధం చేసుకున్న తర్వాత మార్కెట్లో విడుదల చేయాలని భావించినట్లు తెలుస్తోంది.
Bajaj Pulsar 200NS Photo Gallery:

పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్‌ విషయానికి వస్తే, ప్రపంచంలోనే ఎక్కడాని లేని విధంగా తొలిసారిగా ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీతో కూడిన 199.5సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9500 ఆర్‌పిఎమ్ వద్ద 23.4 బిహెచ్‌పిల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 1.86 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. కొత్త పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్ కేవలం 3.8 సెకండ్లలోనే 0 నుండి 60 కి.మీ. వేగాన్ని, అలాగే 9.8 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. (అంటే ఇది మంచి పికప్‌ను కలిగి ఉంటుందని అర్థం).

పల్సర్ 200ఎన్ఎస్ గరిష్టంగా గంటకు 136 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది ఇంతటి శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉన్నప్పటికీ లీటర్ పెట్రోల్‌కు 58 కి.మీ (గంటకు 55 కి.మీ. వేగంతో వెళ్లినప్పుడు మాత్రమే) మైలేజీని కూడా ఇస్తుందని బజాజ్ ఆటో పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Saturday, June 2, 2012, 17:54 [IST]
English summary
The much awaited sports bike Pulsar 200NS from Bajaj Auto is expected to hit the showrooms in this month. According recent reports its already reached to some major dealerships in Pune. The on-road price of Pune is Rs.90,000 only.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+