పల్సర్ 135+యమహా ఆర్15+డ్యూక్ 200 = పల్సర్‌ 200ఎన్ఎస్

బజాజ్ ఆటో తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన కొత్త 2012 "పల్సర్‌ 200ఎన్ఎస్" డిజైన్‌ను గమనిస్తే.. కంపెనీ గతంలో విడుదల చేసిన పల్సర్ 135, యమహా నుండి లభిస్తున్న కొత్త ఆర్15 2.0, కెటిమ్ డ్యూక్ 200 మోడళ్లను కలగలిపి రూపొందించినట్లుగా అనిపిస్తుంది. ఇది చూడటానికి దాని అప్‌గ్రేడ్ వెర్షన్ పల్సర్ 135సీసీ బైక్ అనిపిస్తుంది. అయినప్పటికీ, దీనిని పూర్తిగా సరికొత్త ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా డిజైన్ చేయబడిందని కంపెనీ పేర్కొంది.

ఇందులో ఉపయోగించిన 200సీసీ ఇంజన్‌ను కెటిఎమ్ డ్యూక్ 200సీసీ ఇంజన్‌తో పాటుగానే అభివృద్ధి చేయడం జరిగింది. కానీ, రెండు ఇంజన్లలో ఉపయోగించిన టెక్నాలజీ మాత్రం వేర్వేగానే ఉంది. ఈ స్పోర్ట్స్ బైక్‌లో 199.5సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9500 ఆర్‌పిఎమ్ వద్ద 23.4 బిహెచ్‌పిల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 1.86 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

కొత్త పల్సర్ 200ఎన్ఎస్‌కు సంబంధించిన మరిన్ని చిత్రాలు/ఫోటోల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి:

అధిక మైలేజ్‌ను ఇచ్చేందుకు గానూ కొత్త పల్సర్ 200ఎన్ఎస్ బరువును తక్కువ (145 కేజీలు)గా ఉండేలా రూపొందించారు. దీని మైలేజ్ లీటర్ పెట్రోల్‌కు 58 కి.మీ (గంటకు 55 కి.మీ. వేగం వద్ద), గరిష్ట వేగం గంటకు 136 కి.మీ. ఇది కేవలం 3.8 సెకన్లలోనే 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది, అలాగే 9.8 సెకన్లలో 0-100 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. దీంతో పల్సర్ 200ఎన్ఎస్ బైక్, ఇండియన్ కంపెనీ తయారు చేసిన అత్యం వేగవంతమైన బైక్‌ల జాబితాలో చేరిపోయింది.

ఇందులో ఉపయోగించిన లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ప్రతి సిలిండర్‌కు నాలుగు వాల్వ్‌లను కలిగి ఉండి, ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు స్పార్క్ ప్లగ్‌లతో లభిస్తుంది. ట్రిపుల్ స్పార్క్ ప్లగ్‌ను ఉపయోగించడం వలన సిలిండర్‌లో ఫ్యూయెల్ బర్నింగ్ ప్రాసెస్ చక్కగా జరిగి ఇన్‌స్టాంట్ పికప్, బెటర్ పెర్ఫామెన్స్‌లను అందిస్తుంది. దీని వల్లనే అధిక మైలేజ్‌ కూడా లభిస్తుంది.

కొత్త పల్సర్ 200ఎన్ఎస్‌లో ట్విన్ స్పార్ డైమండ్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. యమహా ఆర్15లో కూడా ఇలాంటి ఫ్రేమ్‌నే ఉపయోగించడం జరిగింది. ముందువైపు కన్వెన్షల్ డబుల్ డౌన్‌ట్యూబ్ సస్పెన్షన్‌ను, వెనుక వైపు గ్యాస్ ఛార్జ్‌డ్ మోనోషాక్ అబ్జార్వర్‌ను ఉపయోగించారు. బజాజ్ ఆటో తాజాగా విడుదల చేసిన కెటిఎమ్ డ్యూక్ 200లో ఉపయోగించిన సైలెన్స్‌ర్ మాదిరిగానే, కొత్త బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్‌‌లో సలెన్సర్ ఉంటుంది.

ఇంజన్‌కు దిగున భాగంలో పెద్దసైజు ట్యాంక్ ఆకారంలో ఈ సైలెన్సర్ ఉంటుంది. ఇకపోతే సురక్షితమైన బ్రేకింగ్ కోసం ముందు వైపు, వెనుక వైపు పెటల్ డిస్క్ బ్రేక్‌లను అమర్చారు. 100/80 R17 సైజు కలిగిన ఫ్రంట్ టైర్, 130/70 R17 సైజు కలిగిన బ్యాక్ టైర్, 1363 మి.మీ. వీల్‌బేస్, 167 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్ సిస్టమ్‌తో, ఎరుపు, పసుపు రంగుల్లో లభిస్తుంది. దీని ధరను కంపెనీ ఇంకా వెల్లడించకపోయినప్పటికీ, ఇది లక్ష రూపాయలకు దిగువన ఉండొచ్చని మార్కెట్ అంచనా. వచ్చే మార్చి నెలాఖరు నాటికి కానీ లేదా ఏప్రిల్ నెల ఆరంభంలో కానీ కొత్త పల్సర్ 200ఎన్ఎస్ వాణిజ్యపరంగా మార్కెట్లో లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 31, 2012, 13:33 [IST]
English summary
Bajaj Auto has added yet another future best seller in its line-up by unveiling the new Pulsar 200NS. The much awaited bike from India's second largest bike manufacturer was unveiled by Bajaj Auto's managing director Rajiv Bajaj. The NS in the new Pulsar 200NS indicates naked sports, clearly showing Bajaj's plans to move towards niche sports bikes from its current line-up of commuter bikes.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+