ట్రెక్కింగ్ కోసం ఫోల్డబల్ బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్
కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేయడం అంటే ఎవరికైనా సరదాగానే ఉంటుంది. చుట్టూ ఉండే ప్రకృతిని చూస్తూ మైమరిచిపోయి, ఆహ్లాదంగా ట్రెక్కింగ్ చేసేస్తుంటాం. అయితే, ట్రెక్కింగ్ కొంత దూరం వరకూ మాత్రమే అలుపు లేకుండా చేయగలం, ఆ తర్వాత అలసిపోయాంటే సరదా సమయం కాస్త చిరాకుగా మారిపోతుంది. అందుకే, నడుస్తూ ట్రెక్కింగ్ చేసి అలసిపోయినప్పుడు ఎంచక్కా మీ బ్యాగ్‌నే సైకిల్‌గా మార్చేసుకొని నడుపుకుంటూ వెళ్లిపోతే ఎలా ఉంటుంది..?
ఈ ఆలోచనకు జీవం పోశారు జర్మన్ ఇంజనీర్లు. ఈ ఫోటోల్లో ఉన్న సైకిల్‌ను చూడండి, దీనిపేరు 'బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్' (Bergmoench Backpack Bike). ట్రెక్కింగ్ చేసి అలసిపోయినప్పుడు సరదాగా సైకిల్‌పై వెళ్లాలనుకున్నా లేదా పూర్తిగా ట్రెక్కింగ్ సాహసోపేతంగా సైకిల్ ద్వారా చేయాలనుకున్నా ఈ సైకిల్ మీకు సహకరిస్తుంది. తేలిక బరువు కలిగి ఉండే ఈ సైకిల్‌ను అవసరం లేదనుకున్నప్పుడు ఎంచక్కా మడిచేసి బ్యాగ్‌లో సర్దేసుకోవచ్చు.
ఈ సైకిల్‌ను ప్రత్యేకించి ట్రెక్కింగ్ ప్రియుల కోసం తయారు చేశారు. దీనిపై కూర్చోవడం కుదరదు. ఎందుకంటే ఇది సీట్ లేని సైకిల్ కాబట్టి. ప్రస్తుతానికి ఇది గ్లోబల్ మార్కెట్లలో మాత్రమే అమ్ముడవుతోంది. ఇండియాన్ మార్కెట్‌కు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ వచ్చిన ధర మాత్రం అధికంగా ఉండటం ఖాయం. అమెరికన్ మార్కెట్లో దీని ధర 1899 డాలర్లు. అంటే మనదేశ కరెన్సీలో సుమారు లక్ష రూపాయలకు పైమాటే..! మరి మేడ్ ఇన్ జర్మనీ అంటే ఆ మాత్రం ఖర్చు పెట్టక తప్పదు.. మీరేమంటారు..?

బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్

బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్

బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్

బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్

బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్

బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్

బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్

బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్

బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్

బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్

బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్

బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్

బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్

బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్

బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్

బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్

బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్

బెర్గ్‌మోయెన్చ్ బ్యాగ్‌ప్యాక్ బైక్



Click it and Unblock the Notifications








