హఠాత్తుగా బైక్‌లో మంటలు: ఘోస్ట్ రైడర్‌లా మారిపోయిన వైనం
హాలీవుడ్ చిత్రం ఘోస్ట్ రైడర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో హీరోపై దెయ్యాలు ఆవరించినప్పుడల్లా అతను మండే అగ్నిగోళంలా మారిపోతాడు. అంతేకాదు, అతని మోటార్‌సైకిల్ కూడా నిప్పులు కక్కుతూ రోడ్డుపై పరుగులు పెడుతుంటుంది. అయితే, ఇది సినిమా కాబట్టి, గ్రాఫిక్స్ మాయాజాలంతో ఎన్ని వింతలైన చేయొచ్చు. మరి ఇలాంటి సంఘటన నిజ జీవితంలో జరిగితే..? అవును మీరు సరిగ్గానే చదివారు. ఇలాంటి ఓ సంఘటనే ఇటీవల చోటు చేసుకుంది.
స్వీడన్‌కు చెందిన బైక్ రేసర్ 'గ్రెగర్ జాన్సన్' స్టాక్‌హామ్ రేస్‌లో పాల్గొనడానికి ముందుకు తన 1950సీసీ ట్విన్ సిలిండర్ రేస్ బైక్‌ను వార్మ్అప్ చేస్తుండగా, ఆ బైక్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేకి క్షణాల్లో బైక్ మొత్తం బూడిదగా మారిపోయింది.
ఉత్తర స్టాక్‌హామ్‌లోని ట్రీప్ ఏరెనాలో ఎఫ్ఐఏ/యూఈఎమ్ స్వీడన్ ఇంటర్నేషనల్ రేస్ కోసం క్వాలిఫై అయ్యేందుకు గాను, రేస్‌లో పాల్గొనడానికి ముందు రేస్ ట్రాక్‌పై గంటకు 190 మైళ్ల వేగంతో పరుగులు పెట్టే తన బైక్ టైర్లను హీట్ చేసేందుకు గానూ స్టాండర్డ్ 'బర్నౌట్' చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, అదృష్ట వశాత్తు ఈ ప్రమాదం నుండి గ్రెగర్ జాన్సన్ సురక్షితంగా బయటపడ్డాడు.
ఒకవేళ ఈ ప్రమాదం రేస్ మధ్యలో జరిగి ఉన్నట్లయితే, భారీ నష్టమే కలిగి ఉండేది. ఈ ఊహించని సంఘటనతో రేస్ చూడటానికి విచ్చేసిన ప్రేక్షకులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఆండీ విల్‌షీర్ ఈ దృశ్యాలను తమ కెమెరాలో బంధించాడు.


Click it and Unblock the Notifications









