డ్రైవర్ అవసరం లేకుండా పరుగులు తీసే రోబో కార్..

BMW Driverless Car
ఇప్పటికే పలు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అసలు డ్రైవర్ అవసరమే లేని కార్లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం "బిఎమ్‌డబ్ల్యూ" కూడా చేరిపోయింది. డ్రైవర్‌తో పనిలేకుండా కారు నడిపించేందుకు బిఎమ్‌డబ్ల్యూ ఇంజనీర్లు ఓ అద్భుతమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.

ఈ మేరకు బిఎమ్‌డబ్ల్యూ రూపొందించిన 'ఫోర్ సెన్స్' సిస్టమ్‌ను బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ కారులో అమర్చి ప్రస్తుతం జెర్మన్ రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది. కెమెరాలు, రాడార్, ఆల్ట్రాసోనిక్స్, లేజర్ సెన్సార్‌ల ఆధారంగా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టుకు సారధ్యం వహిస్తున్న నికో కయింప్చెన్ మాట్లాడుతూ.. ఒక డ్రైవర్ చేయగల అన్ని పనులు ఈ కారు తానంతట అదే చేసుకుంటుందని, ఇది అన్ని ట్రాఫిక నిబంధనలను పాటిస్తుందని, సరైన లైన్‌లో వెళ్తుందని, ఎప్పుడూ కూడా కుడి వైపు నుండి ఓవర్‌టేక్ చేయదని, ప్రతి స్పీడ్ లిమిట్‌కు కట్టుబడి ఉంటుందని తెలిపారు.

పూర్తిగా కొత్త పరిస్థితులను హ్యాండిల్ చేయగలిగేలా ఆల్గారిథమ్‌లను డెవలప్ చేయడమే తమ ముందున్న పెద్ద సవాల్ అని ఆయన చెప్పారు. ఏదైతేనేం ఇలాంటి సెల్ఫ్ డ్రైవెన్ రోబో కార్లు వాస్తవ రూపం దాల్చితే ఇటు డ్రైవర్ ఖర్చు మిగిలిపోతుంది. అటు డ్రైవింగ్ రిస్క్ కూడా తగ్గే అవకాశం ఉంది. మరి ఇలాంటి ప్రయోగాలు ఎంతమేరకు విజయం సాధిస్తాయో భవిష్యత్తే నిర్ణయించాల్సి ఉంది. మీరేమంటారు...?

Article Published On: Thursday, February 2, 2012, 13:22 [IST]
English summary
BMW German developers has developed a self driven robo car, which doesn't requires a driver to drive the car. They used a regular BMW 5 series car, fitted with a 'four sense' system. This system includes radar, cameras, ultrasonics, and laser scanners. Now it is under testing phase.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+