సిబిఆర్ 150ఆర్ కోసం బుకింగ్స్‌ను ప్రారంభించిన హోండా

హోండా అందిస్తున్న సిబిఆర్ 250ఆర్ మోడల్‌ను ఆధారంగా చేసుకుని, ఇందులో చిన్నసైజు ఇంజన్‌తో కూడిన వెర్షన్‌ను తక్కువ ధరకే ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో కంపెనీ ఈ మోడల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం హోండా సిబిఆర్ 250ఆర్ ధర 1.70 లక్షల వరకూ ఉంది. కాగా.. కొత్త సిబిఆర్ 150ఆర్ ధర రూ.1.2 లక్షలకు లోపే ఉండనుంది. యమహా రిఫ్రెష్డ్ "ఆర్15 వెర్షన్ 2.0" స్పోర్ట్స్ బైక్, బజాజ్ కెటిఎమ్ అందిస్తున్న డ్యూక్ 200 మోడళ్లను సవాల్ చేస్తూ హోండా కొత్త సిబిఆర్ 150 మార్కెట్లోకి తీసుకువచ్చింది.
ఈ బైక్‌ను తొలిసారిగా గత జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించింది. హోండా సిబిఆర్ 150ఆర్‌లో ఉపయోగించిన 150సీసీ లిక్విడ్ కూల్డ్, డిఓహెచ్‌సి పిజిఎమ్-ఎఫ్ఐ ఇంజన్ 10,500 ఆర్‌పిఎమ్ వద్ద 18 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. ఇది హోండా సిబిఆర్ 250ఆర్ పవర్ (25 బిహెచ్‌పి) కన్నా 7 బిహెచ్‌పిలు తక్కువ. అలాగే, 7500 ఆర్‌పిఎమ్ వద్ద 12.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది హోండా సిబిఆర్ 250ఆర్ టార్క్(22.9 ఎన్ఎమ్) కన్నా 10.3 ఎన్ఎమ్ తక్కువ.
హోండా సిబిఆర్ 150ఆర్ నిర్మాణంలో ట్విన్ ట్యూబ్లర్ ఫ్రేమ్, మోనో సస్పెన్షన్ (సింగిల్ షాక్ అబ్జార్వర్), డ్యూయెల్ డిస్క్ బ్రేక్స్, వెడల్పాటి ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చారు. అయితే, ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వేరియంట్ అందుబాటులో లేదు. ఇందులో ఉపయోగించిన అడ్వాన్స్ ఓ2 సెన్సార్, ఎయిర్ ఇండక్టర్‌లు తక్కువ కర్బన ఉద్ఘారాలను వెలువడేలా చేస్తాయి. ఇది స్టాండర్డ్, డీలక్స్ అనే రెండు వేరియంట్లలో, రెండు రంగులలో లభ్యం కానుంది. మొదటి బ్యాచ్‌లో భాగంగా దాదాపు 750 బైక్‌లు షోరూమ్‌లకు రానున్నాయి. కాబట్టి, ఎంత త్వరగా బుక్ చేసుకుంటే, అంత త్వరగా బైక్‌ను సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








