బోష్ నుండి నిద్రపోయే డ్రైవర్‌ను అప్రమత్తం చేసే సిస్టమ్
డ్రైవింగ్ చేస్తున్న సమయంలో అప్పుడప్పుడు కంటి మీద కునుకు పట్టడం సహజమే. మరీ ముఖ్యంగా లాంగ్ డ్రైవ్‌లు చేస్తున్నప్పుడు, రాత్రివేళల్లో వాహనం నడుపుతున్న ఇలాంటి సంఘటనలను ఎక్కువగా మనం గమనిస్తుంటాం. ఒక్కొక్క దీని వలన పెను ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. మరి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర పట్టకుండా ఉండాలంటే ఏంచేయాలి. డ్రైవర్ పక్క సీట్లో ఎవరైనా కూర్చుని డ్రైవర్‌ను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తూ ఉండాలి అంటారా..?
ఒకవేళ వాహనంలో ఎవరూ లేకుండా కేవలం డ్రైవర్ మాత్రమే డ్రైవ్ చేస్తుంటే అప్పుడు పరిస్థితి ఏంటి..? మరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. డ్రైవర్‌ను నిద్రపోనివ్వకుండా, ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా అలెర్ట్ చేసే సిస్టమ్ వచ్చేసింది. జర్మనీకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ పరికాలు, సాంకేతిక పరిజ్ఞానాల తయారీ కంపెనీ బోష్ ఓ కొత్త టెక్నాలజీతో ముందుకు వచ్చింది.
ఈ టెక్నాలజీ వాహనం గమనంలో ఉన్నప్పుడు డ్రైవర్‌ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ నిద్రపోనివ్వకుండా చేస్తుంది. డ్రౌజీనెస్ డిటెక్షన్ లేదా స్లీపోమీటర్‌గా పిలిచే ఈ సిస్టమ్‌ను కారులో అమర్చినట్లయితే, డ్రైవర్ తూలుతూ స్టీరింగ్ తిప్పే సందర్భాలను, కారు వెళ్లే వేగాన్ని, యాక్సిలరేటర్ ప్రెస్ చేయబడే విధానాన్ని పరిగణలోకి తీసుకుని డ్రైవ్ నిద్రపోతున్నాడని గుర్తించి, డ్యాష్ బోర్డులో ఓ కాఫీ కప్ సిగ్నల్‌ను ఆన్ చేయటంతో వివిధ శబ్ధాలు చేస్తూ డ్రైవర్‌ను అప్రమత్తం చేసి ప్రమాదాలను అరికడుతుంది. బాగుంది కదూ ఈ డ్రౌజీనెస్ డిటెక్షన్ సిస్టమ్.


Click it and Unblock the Notifications









