ద్విచక్ర వాహనాల సర్వీస్ సెగ్మెంట్లోకి ప్రవేశించిన బోష్
జర్మనీకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ విడిభాగాల తయారీ కంపెనీ బోష్ ఇకపై టూవీలర్లను కూడా సర్వీస్ చేయనుంది. భారత మార్కెట్లో టూవీలర్ సర్వీస్ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తున్నామని బోష్ ప్రకటించింది. ఇందులో భాగంగా 'ఎక్స్‌ప్రెస్ బైక్ సర్వీస్' (ఈబిఎస్) పేరుతో టూ-వీలర్ సర్వీస్ సెంటర్లను ప్రారంభించనున్నామని బోష్ వైస్ ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ ఆఫ్టర్‌మార్కెట్) ఎస్ మురళీధరన్ వెల్లడించారు.
ఒక్కొక్క సిటీలో 10 సర్వీస్ సెంటర్ల చొప్పున 2012 చివరి నాటికి మొత్తం 50 ఈబిఎస్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన తెలిపారు. దేశంలో టూవీలర్ సర్వీస్ నెట్‌వర్క్ ఖాలీను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కొత్త వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నామని మురళీధరన్ చెప్పారు. బోష్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా 500 కార్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ఇదే విధంగా 500 బైక్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని బోష్ భావిస్తోంది.
తమ సర్వీస్ సెంటర్లో అన్ని రకాల బ్రాండ్‌లకు చెందిన ద్విచక్ర వాహనాలను సర్వీస్ చేస్తామని, అలాగే విస్తృత స్థాయిలో అసలైన ద్విచక్ర వాహనాల విడిభాగాలను (జెన్యూన్ స్పేర్ పార్ట్స్) అందిస్తామని కంపెనీ పేర్కొంది. అయితే, ఈ జెన్యూన్ స్పేర్ పార్ట్‌లను ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా, మురళధరన్ మాట్లాడుతూ.. బోష్ సంస్థ చాలా వరకు ఆటోమొబైల్ కంపెనీల కోసం విడిభాగాలను తయారు చేసి సరఫరా చేస్తుందని, తమ సర్వీస్ సెంటర్ల కోసం వాటి ఉత్పత్తిని రెట్టింపు చేస్తామని ఆయన చెప్పారు. ఇదే కాకుండా దశల వారీగా 24x7 మొబైల్ సర్వీసులను కూడా పరిచయం చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు మురలీధరన్ వివరించారు.


Click it and Unblock the Notifications









