సుజుకి హయాటేను కొనండి; సల్మాన్ ఖాన్‌ను కలుసుకోండి

జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి మోటార్ ఇండియా తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన బడ్జెట్ బైక్ 'సుజుకి హయాటే' కోసం ఓ కొత్త క్యాంపైన్‌ను ప్రారంభించింది. ఇప్పుడు సుజుకి హాయటే 110సీసీ బైక్‌ను కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్‌ను కలుసుకునే లక్కీ ఛాన్స్‌ను పొందవచ్చు. సుజుకి హయాటేను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, ఈ బైక్‌కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ 110సీసీ మోటార్‌సైకిల్ కోసం 'ఏక్ థా టైగర్, ఏక్ హై హయాటే' అనే ప్రమోషన్ క్యాంపైన్‌ను కంపెనీ ప్రారంభించింది. ఈ 360-డిగ్రీ క్యాంపైన్ టెలివిజన్, రేడియో, ప్రింట్ మీడియాల్లో ప్రసారం కానుంది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ఆరుగురు విజేతలు ముంబైలో సల్మాన్ ఖాన్‌ను కలుసుకునే అవకాశం కల్పించబడుతుంది. అంతేకాకుండా, ఇందులో ఒకరు సుజుకి హయాటేను ఉచితంగా పొందే అవకాశం కూడా ఉంటుంది.


ఈ క్యాంపైన్ కేవలం సుజుకి హయాటే బైక్ కోసం మాత్రమే కాకుండా, సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ఏక్ థా టైగర్ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో కూడా సాయపడనుంది. ఏక్ థా టైగర్ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.

సుజుకి హయాటే ఫోటో గ్యాలరీ:

స్టయిలిష్ లుక్, ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్, పవర్‌ఫుల్ 112.8సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌, 4-స్పీడ్ గేర్ బాక్స్ (అన్ని గేర్లు క్రింది వైపుకు), 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి విశిష్ట ఫీచర్లతో ఇది లభిస్తుంది. సుజుకి హయాటే కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్లతో లభ్యం కానుంది. దీని మొత్తం బరువు 112 కిలోలు మాత్రమే. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 8 లీటర్లు, మైలేజ్ 70 కి.మీ. ఇందులో సింగిల్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్ (షాషీ)కు ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెషన్, వెనుక వైపు 5-వే అడ్జస్టబల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్‌లను అమర్చారు.

రాష్ట్ర మార్కెట్లో సుజుకి హయాటే కిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.40,271 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) గాను సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.42,271 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) గాను ఉంది. సుజుకి హయాటే వైట్, గ్రీన్, గ్రే, రెడ్, బ్లాక్ కలర్స్‌లో లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Friday, July 20, 2012, 11:30 [IST]
English summary
Japanese two wheeler company Suzuki Motor India has announced its ‘Ek tha Tiger, Ek hai Hayate’ promotion campaign for their 110cc commuter motorcycle, the Suzuki Hayate. Six lucky winners will be selected to meet Salman Khan in Mumbai and one of them will get a Hayate for free.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+