మహీంద్రా స్కూటర్‌ కొనుగోలుపై రూ.2000 పెట్రోల్ ఉచితం

By Ravi

Buy Mahindra Scooter And Get Petrol Free
పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి కొనుగోలుదారులకు కాస్తంత ఉపశమనాన్ని కలిగించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపుకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్ ఇప్పుడు ఓ ఆకర్షనీమైన ఆఫర్‌ను అందిస్తోంది. ప్రస్తుత పండుగ సీజన్‌ను తమ స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్లకు ఉచిత పెట్రోల్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. 'ఫెస్టివల్ ప్రమోషన్ ఆఫర్'గా పిలువబడే ఈ ఆఫర్‌లో మహీంద్రా టూవీలర్స్ అందిస్తున్న ఏ స్కూట‌ర్‌నైనా సరే కొనుగోలు చేసిన వారికి రూ.2,000 రూపాయల విలువ చేసే పెట్రోల్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది.

సాధారణంగా పండుగ రోజుల్లో సన్నిహితులను కలుసుకునేందుకు, పెద్దల ఆశీర్వాదాలు పొందేందుకు మరియు సంతోషాలను పంచుకునేందుకు జరుపుకుంటుంటాం. అయితే, పెరిగిన పెట్రోల్ ధరల కారణంగా దూర ప్రయాణాలు చేసి బంధువులు, స్నేహితులను కలుసుకోవటం కష్టంగా మారుతుందని, ఈ పండుగ సీజన్‌ను తమ వినియోగదారులంతా ఆస్వాదించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. పెట్రోల్‌పై కస్టమర్లు వెచ్చించే రూ.2000 మొత్తాన్ని కంపెనీ తగ్గింపుగా అందిస్తోంది.

ఈ ఉచిత పెట్రోల్ ఆఫర్ అక్టోబర్ 8, 2012 నుంచి అక్టోబర్ 31, 2012 వరకూ అమల్లో ఉంటుందని, దేశవ్యాప్తంగా ఉన్న 411 డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా తమ కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫెస్టివల్ ప్రమోషన్ ఆఫర్ కోసం మహీంద్రా టూవీలర్స్ టెలివిజన్ కమర్షియల్‌ను రూపొందించింది. అన్ని ప్రముఖ టెలివిజన్ ఛానెళ్లలో ఇది ప్రసారం కానుంది. ప్రస్తుతం మహీంద్రా టూవీలర్స్ రోడియో, డ్యూరో, ఫ్లయట్ మరియు కైన్ అనే నాలుగు స్కూటర్లను దేశీయ విపణిలో అందిస్తుంది. మహీంద్రా స్కూటర్స్‌కు ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Friday, October 19, 2012, 15:04 [IST]
English summary
Mahindra Scooters customers will have the opportunity to celebrate the upcoming festive season, without worrying about the rising fuel costs. The company has rolled out yet another customer centric ‘Festival Promotion Offer’ that ensures free petrol worth Rs. 2,000* on the purchase of any Mahindra Scooter. The ‘Festival Promotion Offer’ is an initiative by Mahindra 2 Wheelers to support its customers and their families.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+