బ్యాట్‌ప్యాడ్‌పై అందాల భామ క్యాట్ఉమెన్ సూపర్ రైడ్
ఈ బైక్ చూడగానే మీకు అర్థమైపోయింటుంది. ఇది బ్యాట్‌మ్యాన్ సినిమాల్లో ఉపయోగించే బ్యాట్‌ప్యాడ్ సూపర్‌బైక్ అని. అవును ఇది బ్యాట్‌మ్యాన్ సినిమాల్లో కనిపించే బైకే. అయితే, మరి దీనిని బ్యాట్‌మ్యాన్ కాకుండా ఎవరో అమ్మాయి నడుపుతుందేంటునుకుంటున్నారా..? ఈ క్యారెక్టర్ పేరు క్యాట్ఉమెన్. బ్యాట్‌మ్యాన్ సిరీస్‌లో కొత్తగా రానున్న చిత్రం 'ది డార్క్ నైట్ రైజెస్'లో ప్రముఖ హాలీవుడ్ నటి 'అన్నే హాత్‌వే' ఈ పాత్రను పోషించనుంది.
ది డార్క్ నైట్ రైజెస్ చిత్రంలో క్యాడ్ఉమెన్ పాత్ర నేరాలు, దొంగతనాలను చేస్తుంది. ఈ చిత్రంలో బ్యాట్‌మ్యాన్‌కు చెందిన ఈ బ్యాట్‌ప్యాడ్‌ను క్యాట్ఉమెన్ రైడ్ చేస్తుంది. అలాగే, బ్యాట్‌మ్యాన్ ఉపయోగించే బ్యాట్‌మొబైల్ కారు కూడా ఉంటుంది. ఈ కారును బ్యాట్‌మ్యాన్ ఉపయోగిస్తాడు. ఇప్పటి వరకూ వచ్చిన బ్యాట్‌మ్యాన్ సిరీస్ సినిమాల్లో బ్యాట్‌మొబైల్ కారు కేవలం రోడ్లపై మాత్రమే ప్రయాణించేది. అయితే ఈ కొత్త చిత్రంలో మాత్రం బ్యాట్‌మొబైల్ గాలిలో కూడా విహరించనుంది.
జులై 19న విడుదల కానున్న ది డార్క్ నైట్ రైజెస్ సినిమాలో ఈ కార్, బైక్ ఛేజింగ్ సీన్‌లు సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలువనున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై మార్కెట్లో మంచి హైప్ నెలకొని ఉంది. బ్యాట్‌ప్యాడ్ బ్యాట్‌మొబైల్‌లో ఒక భాగం మాత్రమే. బ్యాట్‌మొబైల్‌లో ఉండే ఓ చిన్ని బటన్‌ను ప్రెస్ చేయగాను బ్యాట్‌మొబైల్ కారు వెనుక చక్రాలు విడిపోయి, ముందు రెండు చక్రాలు ఒకదాని వెనుకకు మరొకటి వచ్చి ఇలా సూపర్‌బైక్‌లా మారిపోతాయి.
అయితే, వాస్తవానికి బ్యాట్‌ప్యాడ్, బ్యాట్‌మొబైల్ రెండు వేర్వేరు వాహనాలు. సినిమాలో గ్రాఫిక్స్ సాయంతో అలా చూపించడం జరుగుతుంది. ఈ బ్యాట్‌మొబైల్ తొలిసారిగా బ్యాట్‌మ్యాన్ బిగిన్స్ అనే చిత్రంలో ఉపయోగించారు. దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'ది డార్క్ నైట్' బ్యాట్‌మొబైల్ కారుతో పాటుగా బ్యాట్‌పాడ్ అనే సూపర్‌బైక్‌ను కూడా ఉపయోగించారు. ఈ వాహనాలకు మంచి క్రేజ్ ఉండటంతో కొత్తగా రానున్న 'ది డార్క్ నైట్ రైజెస్' సినిమాలో బ్యాట్‌పాడ్, బ్యాట్‌మొబైల్‌ను ఉపయోగించటం జరిగింది.


Click it and Unblock the Notifications








