ఏటా 5,000 మందిని బలి తీసుకుంటున్న టెక్స్ట్ మెసేజ్‌లు

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌ను ఉపయోగించటం ప్రమాదకరమని ఎంతో మంది ఎన్నో రకాలుగా చెబుతున్నా సరే అది కొందరి చెవులకు ఎక్కడం లేదు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం కారణంగా, దేశంలో ప్రతి రోజూ ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో, మొబైల్ ఫోన్ ద్వారా టెక్స్ట్ మెసేజ్‌లు (ఎస్ఎమ్ఎస్) పంపించడం కారణంగా ఒక్క అమెరికా రహదారులపైనే ఏటా 5,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటే, ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఖ్య మరెంత అధికంగా ఉంటుందో మనమే ఊహించుకోవచ్చు.

డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించటం వలన డ్రైవర్ పరధ్యానానికి గురయ్యి, ఫలితంగా రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనంలో పరధ్యానానికి గురి కాని వ్యక్తులు ప్రమాదాల బారిన పడటానికి, పరధ్యానానికి గురైన వ్యక్తులు ప్రమాదాల బారిన పడటానికి మధ్య వ్యత్యాసం దాదాపు 23 రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. పరధ్యానానికి గురైన వారిలో ఎక్కువ మంది డ్రైవింగ్ చేస్తున్నప్పు టెక్స్టింగ్ చేసిన కారణంగా ప్రమాదాలు సంభవించినట్లు తేలింది. టెక్స్టింగ్ చేసేటప్పుడు డ్రైవర్ దృష్టి రోడ్డుపై నుండి పక్కకు మరళిపోతుంది.


ఇలా టెక్స్టింగ్ చేసే సమయంలో కనీసం 4.6 సెకండ్ల సమయం పాటు వారి దృష్టి పక్కకు మరళుతుంది. ప్రమాదాలు సంభవించటాని ఈ కాస్తంత సమయం చాలు. ఏదేమైనప్పటికీ, మన దేశంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు (ఏ మోటార్ వాహనమైనా సరే) మొబైల్ ఫోన్లు, బ్లూటూత్స్, హెడ్‌ఫోన్స్ ఐప్యాడ్ వంటి సాంకేతిక పరికరాలను ఉపయోగించడంపై నిషేధం అమలులో ఉంది. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘించినట్లు తెలిస్తే, ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలను విధించటం జరుగుతుంది.

కాబట్టి, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వంటి పరికరాలను ఉపయోగించకండి. మరీ అత్యవసరంగా ఏదైనా టెలిఫోన్ కాల్‌ను అటెండ్ చేయాల్సి వచ్చినా లేదా ఫోన్ చేయాల్సి వచ్చినా వాహనాన్ని రోడ్డుకు పక్కగా నిలిపి హజార్డ్ ఇండికేటర్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే రిసీవ్/కాల్ చేయండి. ఇలా వాహనాన్ని రోడ్డుకు పక్కగా పార్క్ చేసే సమయంలో అది నో పార్కింగ్ జోన్ అవునో కాదో, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందో లేదోనని నిర్ధారించుకోండి. Have A Happy Journey On Roads.

More from DriveSpark

Article Published On: Tuesday, May 22, 2012, 17:34 [IST]
English summary
A recent study conducted in the United States says that texting and talking over the phones while driving are killing more than 5,000 people every year on the country's highways. The report further adds that teen drivers get distracted easily by text messages and phone call while driving.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+