ఎమ్-టెక్ గార్డ్‌లతో స్టయిలిష్ లుక్, మరింత భద్రత

కారుకు అదనంగా ఉపయోగించే ఫ్రంట్, రియర్ గార్డులు మీ వాహనానికి మరింత స్టయిలిష్, స్పోర్టీ లుక్‌ను ఇవ్వటమే కాకుండా, అత్యవసర సమయాల్లో అదనపు భద్రతను కూడా కల్పిస్తాయి. ప్రస్తుతం అనేక రకాల క్రాష్ గార్డులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూనేకు చెందిన ఎమ్-టెక్ ఇంజనీర్స్ అనే కంపెనీ వినూత్నమైన గార్డ్‌లను ఆఫర్ చేస్తుంది.

అధిక నాణ్యత కలిగిన పాలీయూరిథేన్ మెటీరియల్‌, స్టెయిన్‌లెస్ స్టీల్, ఎఫ్ఆర్‌పి అండ్ స్టీల్‌తో తయారు చేసిన క్రాష్ గార్డులను అందిస్తోంది. ప్రమాద సమయాల్లో వాహనం మరొక వాహనాన్ని లేదా వస్తువును ఢీకొట్టినప్పుడు ఆ తాకిడి బలం నేరుగా బాడీపై పడకుండా ఉండేందుకు ఈ క్రాష్ గార్డులు ఉపయోగపడుతాయి. అంతాకుకండా కారుపై గీతలు పడటం నుంచి కూడా రక్షణ పొందవచ్చు.


ఎమ్-టెక్ ఇంజనీర్స్ ఫ్రంట్ క్రాష్ గార్డ్, రియర్ క్రాష్ గార్డ్, లగేజ్ క్యారియర్, సైడ్ స్టెప్స్, ల్యాడర్స్, స్పాయిలర్స్, సీట్స్ వంటి యాక్ససరీలను ఆఫర్ చేస్తుంది. ఇండియాలో అమ్ముడవుతున్న దాదాపు అన్ని ప్యాసింజర్ కార్లకు సెట్ అయ్యే క్రాష్ గార్డులు విభిన్న డిజైన్లు, ఆకృతులలో ఎమ్-టెక్ ఇంజనీర్స్ వద్ద లభ్యమవుతాయి. ఎమ్-టెక్ ఇంజనీర్స్‌కు దేశవ్యాప్తంగా డీలర్లు ఉన్నారు.

టాటా నానో మొదలుకొని టొయోటా ఫార్చ్యూనర్ వరకూ వివిధ మోడళ్లకు ఎమ్-టెక్ ఇంజనీర్స్ క్రాష్ గార్డులను సరఫరా చేస్తుంది. అలాగే, చిన్నపాటి వాణిజ్య వాహనాలకి కూడా ఈ సంస్థ క్రాష్ గార్డులను ఆఫర్ చేస్తుంది. మరిన్ని వివరాల కోసం ఎమ్-టెక్ అధికారిక వెబ్‌సైట్ (http://www.mtekengineers.com/)ను సందర్శించండి.

More from DriveSpark

Article Published On: Monday, July 16, 2012, 14:58 [IST]
English summary
Pune based automotive accessories manufacturer M-Tek Engineers is offering wide range products includes Front Safety Guards, Roof Luggage Carriers, Side Steps, Rear protection Guards, Pickup accessories, Roll bars , Seats required for Sport Utility, Multi Utility vehicles as well as passenger cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+