విడుదలకు సిద్ధమైన హీరో ప్యాషన్ ఎక్స్‌‌ప్రో 110సీసీ బైక్

హీరో బ్రాండ్ మోటార్‌సైకిళ్లంటే ఇష్టపడే బైక్ లవర్స్‌కు ఓ గుడ్ న్యూస్. దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ అయిన హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) మరో సరికొత్త మోటార్‌సైకిల్‌ను కొనుగోలుదారులకు పరిచయం చేయనుంది. గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ప్రదర్శించిన 'ప్యాషన్ ఎక్స్‌‌ప్రో' మోటార్‌సైకిల్‌ త్వరలోనే మార్కెట్లో విడుదల కానుంది. కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తిని కూడా చేపట్టింది.

ఇటు పెర్ఫామెన్స్‌లోను అటు మైలేజ్‌లోను ఎక్కడా రాజీ పడకుండా హీరో మోటోకార్ప్ ఈ బైక్‌ను రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హీరో ప్యాషన్‌తో పోల్చుకుంటే ఇది డిజైన్ పరంగా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండనుంది. ఈ పండుగ సీజన్‌లోనే కొత్త హీరో ప్యాషన్ ఎక్స్‌‌ప్రో మార్కెట్లోకి రావచ్చని సమాచారం. ఈ ఏడాదికి గాను హీరో మోటోకార్ప్ నుంచి రానున్న చివరి ఉత్పత్తి కూడా ఇదే. ఈ సెగ్మెంట్లో లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చిన సుజుకి హయాటే, హోండా డ్రీమ్ యుగ వంటి 110సీసీ బడ్జెట్ మోటార్‌సైకిళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

హీరో ప్యాషన్ ఎక్స్‌‌ప్రో 110సీసీ మోటార్‌సైకిల్

హీరో ప్యాషన్ ఎక్స్‌‌ప్రో 110సీసీ మోటార్‌సైకిల్ - ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్

హీరో ప్యాషన్ ఎక్స్‌‌ప్రో 110సీసీ మోటార్‌సైకిల్

హీరో ప్యాషన్ ఎక్స్‌‌ప్రో 110సీసీ మోటార్‌సైకిల్ - రీస్టయిల్డ్ ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్

హీరో ప్యాషన్ ఎక్స్‌‌ప్రో 110సీసీ మోటార్‌సైకిల్

హీరో ప్యాషన్ ఎక్స్‌‌ప్రో 110సీసీ మోటార్‌సైకిల్ - అల్లాయ్ వీల్స్

హీరో ప్యాషన్ ఎక్స్‌‌ప్రో 110సీసీ మోటార్‌సైకిల్

హీరో ప్యాషన్ ఎక్స్‌‌ప్రో 110సీసీ మోటార్‌సైకిల్ - పవర్‌ఫుల్ 110సీసీ ఇంజన్

హీరో ప్యాషన్ ఎక్స్‌‌ప్రో 110సీసీ మోటార్‌సైకిల్

హీరో ప్యాషన్ ఎక్స్‌‌ప్రో 110సీసీ మోటార్‌సైకిల్ - డిజిటల్ అనలాగ్ కాంబినేషన్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్

హీరో ప్యాషన్ ఎక్స్‌‌ప్రో 110సీసీ మోటార్‌సైకిల్

హీరో ప్యాషన్ ఎక్స్‌‌ప్రో 110సీసీ మోటార్‌సైకిల్ - ఎలక్ట్రిక్ స్టార్ట్


హీరో ప్యాషన్ ఎక్స్‌‌ప్రో 110సీసీ మోటార్‌సైకిల్ ఫీచర్లు:

  • 110సీసీ ఫోర్-స్ట్రోక్ ఇంజన్
  • డిజిటల్ అనలాగ్ కాంబినేషన్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్
  • ఎలక్ట్రిక్ స్టార్ట్
  • రీ స్టయిల్ చేయబడిన ఫ్యూయెల్ ట్యాంక్
  • ఫ్యూయెల్ ట్యాంక్‌పై అమర్చిన స్టయిలిష్ ప్యానెల్స్
  • అల్లాయ్ వీల్స్
  • ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్

హీరో ప్యాషన్ ఎక్స్‌‌ప్రో బైక్‌ను కంపెనీ తమ జపాన్ భాగస్వామి హోండా సాంకేతి పరిజ్ఞానాన్ని ఉపయోగించే అభివృద్ధి చేయటం జరిగింది. అయితే, కొత్త ప్యాషన్ ఎక్స్‌ప్రో మార్కెట్లోకి విడుదలైన తర్వాత, ప్రస్తుతం లభిస్తున్న పాపులర్ హీరో ప్యాషన్ ప్రోను యధావిధిగా కొనసాగించేది లేనిది తెలియాల్సి ఉంది. హీరో ప్యాషన్ ఎక్స్‌‌ప్రో 110సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, October 29, 2012, 11:12 [IST]
English summary
India's largest two-wheeler manufacturer Hero MotoCorp is all set launch the another stylish product for Indian bike lovers. According to recent reports, Company will launch the Passion X-Pro 110cc commuter motorcycle during this festive season.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+