మరికొద్ది మార్కెట్లోకి రానున్న మహీంద్రా రోడియో ఆర్‌జెడ్

మహీంద్రా గ్రూపుకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్ లిమిటెడ్ (ఎమ్‌టిడబ్ల్యూఎల్) ఈ ఏడాది ఆరంభంలో ప్రవేశపెట్టిన అప్‌గ్రేడెడ్, పవర్‌ఫుల్ 125సీసీ స్కూటర్ 'మహీంద్రా డ్యూరో డిజెడ్' మార్కెట్లో మంచి సక్సెస్‌ను సాధించడంతో, ఇప్పుడు కంపెనీ అందిస్తున్న మరొక స్కూటర్ రోడియోలో పవర్‌ఫుల్, స్టయిలిష్ ఫుల్లీ లోడెడ్ 'రోడియో ఆర్‌జెడ్' స్కూటర్‌ను విడుదల చేసేందు సన్నాహాలు చేస్తుంది. ఈ నెలలోనే రోడియో ఆర్‌జెడ్ స్కూటర్ ఎంపిక చేసిన మార్కెట్లలో విడుదల కానుంది.

త్వరలో విడుదల కానున్న తమ కొత్త స్కూటర్ రోడియో ఆర్‌జెడ్ విడుదల పట్ల తాము ఎంతో ఉత్సుకతతో ఉన్నామని, ఇది శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉండి అధిక పెర్ఫామెన్స్‌ను ఇవ్వటమే కాకుండా, విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉంటుందని మహీంద్రా టూవీలర్స్ సీనియర్ వెస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ కస్టమర్ కేర్) శ్రీ. వీరెన్ పోప్లీ తెలిపారు. ఈ జిప్పీ, స్టయిలిష్ స్కూటర్‌ను రైడ్ చేయటానికి ఆధునిక జంటలు, యువత ఎంతగానో ఇష్టపడగలరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


మహీంద్రా డ్యూరో డిజెడ్ మాదిరిగానే మహీంద్రా రోడియో ఆర్‌జెడ్ స్కూటర్ కూడా 125సీసీ ఇంజన్‌తో లభ్యం కానుంది. అయితే, పాత రోడియోతో పోల్చుకుంటే ఈ కొత్త రోడియో ఆర్‌జెడ్ స్కూటర్ అనేక మార్పులు ఉండనున్నాయి. వీటి గురించి తెలుగు డ్రైవ్ స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. గడచిన మే నెలలో మహీంద్రా టూవీలర్స్ మొత్తం 9,096 స్కూటర్లను విక్రయించింది. వీటిల్లో ఎక్కువగా డ్యూరో డిజెజ్ స్కూటర్లే ఉన్నాయి.

మహీంద్రా టూవీలర్స్ విడుదల చేసిన డ్యూరో డిజెడ్ ఫ్యామిలీ స్కూటర్‌గా ఆ సెగ్మెంట్లోని కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేయగా, రోడియో ఆర్‌జెడ్ స్కూటర్‌ను ప్రధానం యువతను దృష్టిలో ఉంచుకొని ఆకర్షనీయమైన ఫీచర్లు, స్టయిలిష్ లుక్‌తో డిజైన్ చేయటం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే కొత్త మహీంద్రా రోడియో ఆర్‌జెడ్ స్కూటర్ మార్కెట్‌ను తాకనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 13, 2012, 11:42 [IST]
English summary
Riding on the success of the recently launched Duro DZ, the Mahindra Two Wheelers Ltd (MTWL) plans to launch yet another scooter - the powerful, stylish, fully loaded Rodeo RZ in select markets this month.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+