డిస్కవర్ సరికొత్త వేరియంట్‌ను విడుదల చేయనున్న బజాజ్
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న డిస్కవర్ డిజైన్‌ను దాదాపుగా అలాగే ఉంచుతో గ్యాస్ ఫిల్డ్ మోనషాక్ అబ్జార్వర్ (కొత్త పల్సర్, హోండా యునికార్న్ మోడళ్లలో ఉపయోగించినట్లుగా సింగిల్ సెంటర్ సస్పెన్షన్)ను ఇందులో కొత్తగా జోడించినట్లు ఈ చిత్రం ద్వారా తెలుస్తోంది. కొత్త డిస్కవర్ ఫ్యూయెల్ ట్యాంక్ ప్రస్తుత వెర్షన్ కన్నా పెద్దదిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఫ్రంట్ సస్పెన్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్‌లు యధావిధిగా ఉన్నాయి. రీడిజైన్ చేయబడిన సైలెన్సర, సరికొత్త ఇండికేటర్స్, హెక్సాగనల్ షేప్‌లో ఉండే సరికొత్త రియర్ వ్యూ మిర్రర్స్ (సైడ్ మిర్రర్స్), రీడిజైన్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ (స్పీడోమీటర్ కన్సోల్) వంటి అనేక మార్పులు సరికొత్త డిస్కవర్‌లో ఉండనున్నాయి.
కొత్తగా మార్కెట్లోకి రానున్న ఈ సరికొత్త 2012 బజాజ్ డిస్కవర్ ఖచ్చితంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిస్కవర్ ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండనుంది. కాగా.. బజాజ్ తాజాగా ప్రవేశపెట్టిన పల్సర్ 200ఎన్ మోడల్ అమ్మకాలు వచ్చే నెల నుండి ప్రారంభం కానున్నాయి. బజాజ్ నుండి డిస్కవర్, పల్సర్ బ్రాంజ్‌లు అత్యధికంగా అమ్ముడవుతున్న సంగతి తెలిసిందే. కొత్త మోడళ్ల రాకతో వీటి జోరు మరింత పెరగనుంది.


Click it and Unblock the Notifications









