కార్ కస్టమైజేషన్ సేవలను అందించనున్న మారుతి!

దీని గురించి మారుతి సుజుకి ఇండియా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్. దయాల్ మాట్లాడుతూ.. కొనుగోలుదారుల ఇష్టాయిస్టాల మేరకు కార్లను అందించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుందని, ఇది తమకొక దీర్ఘకాలిక ప్రణాళిక అని, ప్రస్తుతం ఆలోచన ప్రక్రియ మారుతుందని, వినియోగదారుల అవసరాలకు త్వరగా స్పందిచాల్సిన అవసరం ఉందని, ఒకవేళ ఎవరైనా కొనుగోలుదారుడు తన కారులో నిర్ధిష్టమైన ఫీచరును కావాలనుకున్నప్పుడు తాము దానిని అందించే విధంగా ఉండాలని ఆయన అన్నారు.
అయితే, మారుతి సుజుకికి ఇలా కస్టమైజేషన్ చేయటం మొదటిసారేం కాదు. గతంలో కంపెనీ అందించిన మల్టీ-పర్పస్ వెహికల్ వెర్సా కోసం కస్టమైజేషన్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. దీనిని టాక్సీగా వాడాలనుకున్న కొనుగోలుదారుల అభిరుచుల మేరకు డ్రైవర్ కంపార్ట్‌మెంట్‌ను వేరు చేస్తూ మోడిఫికేషన్ చేసింది. వాహనాల కస్టమైజేషన్ కోసం లాజిస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుందని దయాల్ తెలిపారు. ప్రస్తుతం భారతదేశపు రోడ్లపై తిరుగుతున్న ప్రతి నాలుగు కార్లలో ఒక మారుతి సుజుకి కారు ఉంటుంది.


Click it and Unblock the Notifications








