బైక్ రేసింగ్ టీమ్ 'ఎమ్‌ఎస్‌డి ఆర్-ఎన్'ను ప్రారంభించిన ధోనీ
ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్‌లపై ఉన్న క్రేజ్ ఏంటో క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే. వేగంగా వెళ్లే బైక్‌లంటే ఇష్టపడే ధోనీ ఇప్పుడు తన స్వంతంగా ఓ బైక్ రేసింగ్ టీమ్‌ను ప్రారంభించాడు. ధోనీ తన బైక్ రేసింగ్ జట్టుకు 'ఎమ్‌ఎస్‌డి ఆర్-ఎన్ రేసింగ్ టీమ్ ఇండియా' అనే పేరును పెట్టాడు. అంతేకాదండోయ్.. ఈ జట్టు ఎఫ్ఐఎమ్ సూపర్‌స్పోర్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొనబోతుంది.
ఎమ్ఎస్ ధోనీ బైక్ రేసింగ్ జట్టు 'ఎమ్‌ఎస్‌డి ఆర్-ఎన్ రేసింగ్ టీమ్ ఇండియా'లో ఫ్లోరియన్ మారినో, డ్యాన్ లిన్‌ఫుట్ అనే ఇద్దరు రైడర్లు ఉన్నారు. భారత్‌కు 2012 వరల్డ్ కప్ తెచ్చిన ఈ కెప్టెన్ బైక్ రేసింగ్ జట్టును కలిగి ఉన్న తొలి క్రికెటర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. మారియానో ఫ్రాన్స్‌కు చెందిన రైడర్ కాగా, లిన్‌ఫుట్ బ్రిటన్‌కు చెందిన రైడర్. ఈ ఇద్దరు రేసర్లు కూడా గతంలో అనేక అవార్డులను తమ ఖాతాలలో వేసుకున్నారు.
ఎమ్‌ఎస్‌డి ఆర్-ఎన్ రేసింగ్ టీమ్ ఇండియా తొలిసారిగా బ్రనో, చెక్ రిపబ్లిక్‌లో గడచిన జులై 21 నుంచి 22 వరకూ జరిగిన రేస్‌లో పాల్గొంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఎమ్‌ఎస్‌డి ఆర్-ఎన్ రేసింగ్ టీమ్ ఇండియా కవాసకి జెడ్ఎక్స్-6ఆర్ సూపర్‌బైక్‌లను ఉపయోగించింది. ఈ జట్టులో టాలీవుడ్ నటుడు హీరో నాగార్జున డైరెక్టర్‌గా ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 9న జర్మనీలో జరగనున్న రేస్‌లో ఈ జట్టు పాల్గొనబోతుంది.
అనేక క్రికెట్ మ్యాచ్‌లలో మోటార్‌సైకిళ్లను గెలుచుకున్న ఎమ్ఎస్ ధోనీ ఇటీవలే ఓ అమెరికన్ సూపర్‌బైక్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ప్రముఖ సూపర్‌బైక్‌ల తయారీ కంపెనీ కాన్ఫెడరేట్ మోటార్‌సైకిల్స్ అందిస్తున్న ఎక్స్132 హెల్‌క్యాట్ పవర్‌ఫుల్ మోటార్‌సైకిల్‌ను ధోనీ గత ఐపిఎల్ సీజన్ సమయంలో కొనుగోలు చేశాడు.
ఎక్స్132 హెల్‌క్యాట్ సూపర్‌బైక్‌లో శక్తివంతమైన 2163 సీసీ వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 132 బిహెచ్‌పిల శక్తిని, 150 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యవల్ గేర్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇండియాలో ఎక్స్132 హెల్‌క్యాట్ సూపర్‌బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.27 లక్షలకు పైమాటే. ఎక్స్132 హెల్‌క్యాట్ బైక్ కొనుగోలుతో ఇండియాలో ఈ బైక్‌ను ఉన్న ఏకైక వ్యక్తి కూడా మహేంద్ర సింగ్ ధోనీనే.


Click it and Unblock the Notifications








