కారులో సైతం డిష్ టివి సౌకర్యం: డిష్ టివి ఆన్ వీల్స్

కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఐపిఎల్ మ్యాచ్‌లను మిస్ అవుతున్నారా..? అయితే బాధపడకండి. డిష్ టివి మీ చెంత ఉండగా ఇక చింత ఎందుకు? అవును ప్రస్తుతం టెలివిజన్ రంగంలో డిష్ కేబుల్‌తో సంబంధం లేకుండా వైర్‌లెస్ ప్రసారాలను అందిస్తున్న డిష్ టివి, ఇప్పుడు అదే టెక్నాలజీని కార్లకు అన్వయించనుంది.

చలనంలో ఉన్న కార్లలో సైతం స్పష్టమైన ప్రసాలు వచ్చే విధంగా "మొబైల్ డిష్ టివి"ని డిష్ టివి అందిస్తోంది. ఈ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ పరికరాన్ని మీ కారుకు అమర్చుకుంటే, ఎంచక్కా మీరు ఎక్కడున్నా సరే పాటలు, ఆటలు, క్రికెట్, టివి సీరియళ్లు ఏవీ మిస్ కాకుండా చూడొచ్చు.


ఇదెలా పనిచేస్తుంది..?
ప్రత్యేక క్రాస్ బార్‌లను ఉపయోగించి మీ వాహనం యొక్క పైభాగంలో ఓ సన్నటి యాంటినాను ఫిక్స్ చేయబడుతుంది. 36,000 కి.మీ. కక్ష్యలో తిరుగుతున్న డిష్ టివి శాటిలైట్‌ను ఈ యాంటినా ఆటోమేటిక్‌గా ట్రాక్ చేస్తుంది. వాహనం ఎంత వేగంలో వెళ్తున్నా సరే ఇది కవరేజ్ ఏరియాలో ఉన్నంత వరకూ స్పష్టమైన ప్రసారాలను అందిస్తుంది.

కారుకు అమర్చిన ఈ యాంటినా శాటిలైట్ సిగ్నల్స్‌‌ను గ్రహించి కారులో అమర్చిన సెట్ టాప్ బాక్స్ (ఎస్‌టిబి)కు చేరవేస్తుంది. ఈ ఎస్‌టిబి కారులో ఉన్న ఎల్‌సిడి స్క్రీన్‌కు వీడియో అవుట్‌పుట్‌ను, ఆడియో యూనిట్‌కు ఆడియో అవుట్‌పుట్‌ను అందజేస్తుంది. ఈ మొత్తం సిస్టమ్ కూడా 12 వోల్ట్ బ్యాటరీ ఆధారంగానే పనిచేస్తుంది. ఇదేమీ ఎక్కువ విద్యుత్‌ను కూడా ఖర్చు చేయదు.

డిష్ టివి ఆన్ వీల్స్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం కంపెనీ డిష్ టివి వెబ్‌సైట్‌ను సందర్శించండి.

More from DriveSpark

Article Published On: Tuesday, April 17, 2012, 19:17 [IST]
English summary
Dishtv presenting the revolutionary Mobile dishtv. Your solution to the cricket all you miss while traveling, the top stories that elude you. Mobile dishtv revolutionizes your driving experience by beaming digital entertainment directly into your car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+