మహీంద్రా స్కూటర్లతో పడరాని పాట్లు పడుతున్నాం..!!
అయితే, మహీంద్రా స్కూటర్లను కొనుగోలు చేసిన వారిలో కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మహీంద్రా స్కూటర్లను కొనుగోలు చేసి తాము ఎదుర్కుంటున్న ఇబ్బందుల గురించి మా పాఠకులు తన అభిప్రాయాన్ని మాతో పంచుకోవటం జరింగింది.
బెంగుళూరుకు చెందిన సౌమ్య అనే డ్రైవ్ స్పార్క్ పాఠకురాలు గత కొద్ది నెలల క్రిత మహీంద్రా డ్యూరో స్కూటర్‌ను కొనుగోలు చేసింది. అయితే, ఈ స్కూటర్ డిజైన్, మైలేజ్, ఇంజన్, బ్యాటరీ, పెర్ఫామెన్స్‌ల పట్ల తాను ఏ మాత్రం సంతృప్తిగా లేనని, దీనిపై తాను వెచ్చించిన రూ.55,000 మొత్తం వృధానేనని, ఇకపై మహీంద్రా స్కూటర్లను కొనుగోలు చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటోంది.
అలాగే, లతా శ్రీరామ్ అనే ఓ గృహిణి రెండేళ్ల క్రితం డ్యూరో స్కూటర్‌ను కొనుగోలు చేశారట. ఈ స్కూటర్ సమస్య లేకుండా నడిచి రోజులను వేళ్లపై లెక్కించవచ్చని ఆమె చెబుతోంది. మైలేజ్, బ్రేక్ ఫెయిల్ వంటి సమస్యలను తరచూ ఎదుర్కోవటం జరుగుతుందని లతా శ్రీరామ్ అంటోంది.
అసలు నిజం ఏమిటి..?
వాస్తవానికి కైనటిక్ కంపెనీని మహీంద్రా టూవీలర్స్ స్వాధీనం చేసుకున్నప్పు ఆ కంపెనీ వద్ద సరైన సాంకేతిక భాగస్వామి లేని కారణంగా మెరుగైన ఉత్పత్తులను కంపెనీ అందించ లేకపోయిన మాట వాస్తవమే. అయితే, ప్రస్తుతం మహీంద్రా టూవీలర్స్ విడుదల చేసిన అప్‌గ్రేడెడ్ డ్యూరో డిజెడ్, రోడియో ఆర్‌జెడ్ మోడళ్లకు మార్కెట్లో మంచి స్పందనే లభిస్తోంది. ద్విచక్ర వాహన విభాగంలో మరింత ముందుకు సాగిపోయేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.
ఇందులో భాగంగా కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు మహీంద్రా టూవీలర్స్ ఇటీవలే పూణేలో ఓ కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. అంతేకాకుండా సాంకేతిక భాగస్వామి కోసం కూడా కంపెనీ శోధిస్తున్నట్లు సమాచారం. గతంలో మహీంద్రా విడుదల చేసిన మోటార్‌సైకిల్ స్టాలియో 110సీసీలో కూడా గేర్ బాక్స్ సమస్యలు రావడంతో ఈ మోడల్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. మొత్తమ్మీద మహీంద్రా టూవీలర్స్ సర్వీస్ నెట్‌వర్క్ విస్తృతంగా లేని కారణంగా కొనుగోలుదారులు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.


Click it and Unblock the Notifications









