హారన్ మ్రోగించినందుకు డాక్టర్‌ను హత్య చేసిన యువకులు
నాగ్‌పూర్‌కు చెందిన డా. ఫజల్ షేక్ (87 ఏళ్లు) అనే ఓ వైద్యుడు తనకు ఎదురుగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను సైడ్ ఇవ్వమనటం కోసం హారన్ మ్రోగించాడు, దీంతో చిరాకు పడిన ఆ ఇద్దరు యువకు కోపంతో ఓ పెద్ద బండరాయిని తీసుకొని కారు ఫ్రంట్ అద్దంపై విసిరేశారు. ఆ రాయి కారు అద్దాన్ని పగలగొట్టుకొని లోపల ఉన్న వ్యక్తి తలకు బలంగా గుద్దుకోవటంతో డాక్టర్ మృతి చెందాడు.
ఈ సంఘటనలో నిందుతులు రవి థాకూర్ (20 ఏళ్లు), దత్తు మండవ్‌గనే (23 ఏళ్లు) లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వారి బంగారు భవిష్యత్తు ఇనుప చువ్వల వెనక్కు వెళ్లిపోయింది. అర్థం లేని కోపం, ఆపుకోలేని ఆవేశం, సహనం లేని వారి స్వభావాలే వారి జీవితాన్ని నాశనం చేశాయి. రోడ్డుపై ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతుంటాయి.
ఇలా అయిన వాటికి కాని వాటికి కోపం తెచ్చుకొని, ఆ కోపాన్ని అవతలి వ్యక్తులపై చూపిస్తే ఇటు తమ జీవితాన్ని రిస్కులో పెట్టడమే కాకుండా, అవతలి వారి జీవితాన్ని కూడా రిస్కులో పడేసిన వారు అవుతారు. కాబట్టి, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవతలి వాళ్లు ఒక మాట అన్నప్పటికీ.. ఓర్పు, సహనంతో వ్యవహరించి గొడవలకు దిగకుండా ముందుకు సాగిపోవాలే తప్ప ఇలా గొడవలు పెట్టుకొని జీవితాలు పాడు చేసుకోరాదు. మీరేమంటారు..?


Click it and Unblock the Notifications
