ఎక్సేంజ్ ఆఫర్‌ను చూసి మురిసిపోకండి.. నిజం తెలుసుకోండి..!!

ప్రస్తుతం నానో కోసం టాటా మోటార్స్ రెండు ఆఫర్లను అందిస్తుంది. ఇందులో మొదటిది ఎక్సేంజ్ ఆఫర్. ఈ ఆఫర్ ప్రకారం, కొనుగోలుదారులు తీసుకువెళ్లే పాత వాహనపు రీసేల్ వ్యాల్యూపై అధనంగా ఫోర్-వీలర్ అయితే రూ.25,000, టూ-వీలర్ అయితే రూ.20,000 ఎక్సేంజ్ బోనస్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.
ఇకపోతే రెండవ ఆఫర్ డిస్కౌంట్ ఆఫర్. దీని ప్రకారం, ఎక్సేంజ్ లేకుండా లోన్/క్యాష్ ద్వారా నానోను కొనుగోలు చేసే వారికి ఆన్-రోడ్ ధరపై రూ.10,000 డిస్కౌంట్‌ను అందించడం జరుగుతుంది.
ఈ రెండింటిలో ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే వర్తిస్తుంది. అంటే ఎక్సేంజ్ బోనస్ ఆఫర్ లేదా డిస్కౌంట్ ఆఫర్. ఎక్సేంజ్ బోనస్ ఆఫర్‌లో మీ పాత వాహనపు రీసేల్ వ్యాల్యూను ఎస్టిమేషన్/అసెస్‌మెంట్ చేసేటప్పుడు అక్కడున్న షోరూమ్ డీలర్లు/సేల్స్ ప్రతినిధులు మీ పాత వాహనానికి అత్యంత తక్కువ వెల కట్టడం జరుగుతుంది. అదే వాహనాన్ని మీరు బయటి మార్కెట్లో విక్రయిస్తే ఎక్కువ వెల పలుకుతుంది.
ఉదాహరణకు, మూడు నెలలు ఉపయోగించిన హోండా షైన్ బైక్‌ను టాటా షోరూమ్ వాళ్లు కొనుగోలు చేసేటప్పుడు కేవలం రూ.40,000 (అసలు ఆన్-రోడ్ ధర సుమారు రూ.65,000) మాత్రమే వెల కడతారు. అంటే దాదాపు దాదాపు 25,000 నష్టాన్ని మీ వాహనాన్ని విక్రయించాల్సి ఉంటుంది. ఇదే వాహనాన్ని మీరు సెకండ్ హ్యాండ్ బైక్ మార్కెట్లో విక్రయిస్తే సుమారు రూ.55,000 నుండి రూ.58,000 రేంజ్‌లో వెల పలుకుతుంది.
సింపుల్‌గా చెప్పాలంటే, కంపెనీ ఆఫర్ చేస్తున్న అదనపు ఎక్సేంజ్ బోనస్‌ను కొనుగోలుదారుల నుండే భర్తీ చేసుకునేందుకు డీలర్లు/సేల్స్‌మెన్స్ ప్రయత్నిస్తున్నారు. ఇదంతా వారి మ్యాజిక్, ఈ మాయలో పడిపోయి మీ వాహనాన్ని అతి తక్కువ ధరకే విక్రయించకండి. రెండు మూడ దగ్గర్ల మీ వాహనపు రీసేల్ వ్యాల్యూని అంచనా వేయించిన తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోండి.
ఒకవేళ బయటి మార్కెట్లో మీ వాహనానికి మంచి రీసేల్ వ్యాల్యూ లభించనట్లయితే, అక్కడే మీ వాహనాన్ని విక్రయించేసి, డౌన్‌పేమెంట్/క్యాష్ పేమెంట్ ఆప్షన్ ద్వారా నానో కారునుకొనుగోలు చేసి ఆన్-రోడ్ ధరపై రూ.10,000 డిస్కౌంట్‌ను పొందడం ఉత్తమం.


Click it and Unblock the Notifications








