125-150సీసీ బైక్‌లను విడుదల చేయనున్న హ్యోసంగ్

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ 'హ్యోసంగ్' భారత మార్కెట్లో మరిన్ని కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రీమియం బైక్ మేకర్‌గా ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన హ్యోసంగ్ ఇప్పుడు మాస్ బైక్ సెగ్మెంట్‌పై కన్నేసింది. ఇటీవలే 250సీసీ ఇంజన్ సామర్థ్యంతో కూడిన స్పోర్ట్స్ బైక్ 'హ్యోసంగ్ జిటి250ఆర్'ను విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు 125-150సీసీ సెగ్మెంట్లో కూడా బైక్‌లను ఆఫర్ చేయాలని యోచిస్తోంది.


గతంలో పూనేకు చెందిన గార్వారే మోటార్స్ ద్వారా భారత మార్కెట్లో ప్రవేశించిన హ్యోసంగ్ ఇటీవలే ఆ భాగస్వామ్యం నుంచి తప్పుకొని, పూనేకు చెందిన డిఎస్‌కె మోటోవీల్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హ్యోసంగ్ మోటార్‌సైకిళ్లను దేశీయ విపణిలో మంచి ఆదరణ లభిస్తుండటంతో, కేవలం ప్రీమియం మోటార్‌సైకిళ్లను మాత్రమే కాకుండా మాస్ సెగ్మెంట్ బైక్‌లను కూడా అందించాలని కంపెనీ యోచిస్తోంది.

ప్రస్తుతం హ్యోసంగ్ అందిస్తున్న బైక్‌లన్నీ కూడా సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో విదేశాలను దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించడం జరుగుతోంది. అయితే, రానున్న రోజుల్లో ఎక్కువ భాగం భారత మార్కెట్లో లభ్యమయ్యే విడిభాగాలనే ఉపయోగించిన వీటిని ఇక్కడే అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం డిఎస్‌కె మోటోవీల్స్‌ భాగస్వామ్యంతో హ్యోసంగ్ పూనేలో ఓ అసెంబ్లింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనుంది.

ఇలా చేయడం వలన ఉత్పత్తి వ్యయం తగ్గి, తక్కువ ధరకే బైక్‌లను అందించేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం హ్యోసంగ్ దేశీయ విపణిలో జిటి 650ఆర్, జిటి 650ఎన్, ఎస్‌టి7 క్రూయిజర్ బైక్‌లను అందిస్తోంది. కంపెనీ ఇటీవలే హ్యోసంగ్ జిటి250ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను విడదల చేసింది. భారత మార్కెట్లో హ్యోసంగ్ జిటి250ఆర్ స్పోర్ట్స్ బైక్ ధర రూ.2.75 లక్షలుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 8, 2012, 18:59 [IST]
English summary
According to sources, South Korean sports bike manufacturer Hyosung and its Pune partner DSK Motowheels is mulling to launch 125-150cc segment bikes in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+