లక్ష రూపాయల తగ్గింపు ధరకే డ్యుకాటి మోన్‌స్టర్ 795 బైక్

Ducati Monster 795
డ్యుకాటి మోన్‌స్టర్ 795 సూపర్‌బైక్ విడుదల గురించి గతంలో తెలుగు డ్రైవ్ స్పార్క్ ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇటలీకు చెందిన ఈ సూపర్‌బైక్‌ల తయారీ సంస్థ అందరినీ ఆశ్చర్యపరుస్తూ అత్యంత ఆకర్షనీయమైన ధరకే ఈ మోన్‌స్టర్ బైక్‌ను ఇండియాలో విడుదల చేసింది. సుమారు రూ.7 లక్షల ఖరీదు చేసే ఈ సూపర్‌బైక్‌ ధరను లక్ష రూపాయల మేర తగ్గించి రూ.6 లక్షలకే అందిస్తుంది.

అయితే భారత్‌లో అమ్ముడయ్యే మొదటి 300 డ్యుకాటి మోన్‌స్టర్ 795 సూపర్‌బైక్‌లు మాత్రమే రూ.5.99 లక్షల ప్రైస్ ట్యాగ్‌తో లభ్యం కానున్నాయి. ఆ తర్వాత నుండి అమ్ముడయ్యే డ్యుకాటి మోన్‌స్టర్ 795 సూపర్‌బైక్‌ ధర మాత్రం 6.99 లక్షలుగా ఉంటుంది. ఇంట్రడక్టరీ ఆఫర్ క్రింద ఇండియాలో మొదటి బ్యాచ్‌లో విక్రయించే ఈ మోడళ్లను తగ్గింపు ధరకు అందిస్తున్నామని కంపెనీ వివరించింది.

కాగా.. ఈ సెగ్మెంట్లో బైక్‌ల అమ్మకాలు తక్కువగా ఉంటాయి కాబట్టి, ఈ బైక్ ధర అంత త్వరగా పెరిగే అవకాశం కనబడటం లేదు. ఏదేమైనప్పటికీ ఈ బైక్‌ను ముందుగా బుక్ చేసుకున్న వారు (అంటే 300 లోపు కస్టమర్లు) మాత్రం లక్ష రూపాయల తగ్గింపును ఎంజాయ్ చేయవచ్చు. మోన్‌స్టర్ 795 బైక్‌ను డ్యుకాటి సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో థాయ్‌లాండ్ నుండి ఇండియా దిగమతి చేసుకుని ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తుంది.

థాయ్‌లాండ్‌కు ఇండియాకు మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం ఉండటం వల్ల వీటి పై ఎక్సైజ్ సుంఖం 20 శాతం మాత్రమే ఉంటుంది. సాధారణంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే వాహనాలపై 60 శాతం ఎక్సైజ్ సుంఖం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారణం చేతనే కంపెనీ తక్కువ ధరకే మోన్‌స్టర్ 795 సూపర్‌బైక్‌ను భారత్‌లో రూ.5.99 లక్షలకే ఆఫర్ చేయడం జరుగుతుంది.

ఇకపోతే డ్యుకాటి మోన్‌స్టర్ 795 సూపర్‌బైక్ విషయానికి వస్తే, ఇది శక్తివంతమైన 803సీసీ డెస్మోడ్రొమిక్ ఎల్-ట్విన్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద 87 పిఎస్‌ల శక్తిని, 6250 ఆర్‌పిఎమ్ వద్ద 78 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. దాదాపు 167 కిలోల బరువున్న 'డ్యుకాటి మోన్‌స్టర్ 795' 6-వీల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 10, 2012, 11:25 [IST]
English summary
It is a well known fact that Ducati motorcycles cost a bomb. Everyone were surprised when the Italian bike maker launched the Monster 795 with a price tag of Rs.5.99 lakhs only. But Ducati has now stated the Rs.5.99 price tag for the Monster 795 will not remain for ever. In fact just the first 300 Monster 795 will be priced at that level.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+