విడుదలైన ఒక్కరోజులోనే లక్ష రూపాయాల ప్రైస్ కట్..

మోన్‌స్టర్ 795 సూపర్‌బైక్‌ను కంపెనీ గడచిన శుక్రవారం ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో రూ.6.99 లక్షల ధరతో డ్యుకాటి విడుదల చేసింది. అయితే, అప్పటికే, ట్రైయంప్ వంటి వివిధ కంపెనీలు మరింత పోటీ ధరలకే ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో, కంపెనీ ఒక్క రోజులోనే డ్యుకాటి మోన్‌స్టర్ 795 ధరను రూ.1 లక్షల రూపాయలు తగ్గించి కేవలం రూ.5.99 లక్షల ప్రారంభ ధరకే అందిస్తోంది.
డ్యుకాటి మోన్‌స్టర్ 795 బైక్ శక్తివంతమైన 803సీసీ డెస్మోడ్రొమిక్ ఎల్-ట్విన్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద 87 పిఎస్‌ల శక్తిని, 6250 ఆర్‌పిఎమ్ వద్ద 78 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. దాదాపు 167 కిలోల బరువున్న 'డ్యుకాటి మోన్‌స్టర్ 795' 6-వీల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








