మూన్‌రైడర్ హైబ్రిడ్ ఫ్లయింగ్ బైక్‌తో గాలిలో చక్కర్లు

మోటార్‌బైక్‌పై రోడ్డుపై రయ్.. రయ్.. మంటూ దూసుకుపోవటం బోర్ కొట్టేసిందా.. మోటార్‌బైక్ ఎంచక్కా మేఘాలలో తేలిపోవాలని కొత్త కోరిక పుట్టిందా..! అయితే, మీ కోరికలు త్వరలోనే నిజం కానున్నాయి.

ఇదిగో ఈ ఫోటోలో ఉన్న మోటార్‌సైకిల్‌ను చూశారా.. దీనిపై రోడ్డుపై సవరీ చేయవచ్చు, అవసరమైతే గాలిలోనూ చక్కర్లు కొట్టచ్చు. అన్నట్టు దీనిపేరు ఎంటో తెల్సా.. 'మూన్‌రైడర్ హైబ్రిడ్ ఫ్లయింగ్ మోటార్‌సైకిల్' (MoonRider Hybrid Flying Motorcycle). పేరుకు తగినట్లుగానే ఇది గాలిలో మూన్ రైడ్ అనుభూతిని కల్పించటం ఖాయం.


సెర్బియాకు చెందిన మార్కో డిజైన్స్ కంపెనీ ఈ మూన్‌రైడర్ హైబ్రిడ్ టూవీలర్‌ను డిజైన్ చేసింది. దీనిని మోటార్‌బైక్ మాదిరిగానూ, అలాగే ఫ్లయింగ్ మెషీన్‌గానూ డ్రైవ్ చేసుకోవచ్చు. ఈ లైట్ వెయిట్ మోటార్‌సైకిల్‌లో జీరో ఎమిషన్ (సున్నా కర్భన వ్యర్థాలు వెలువరించేది) ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో దీనిని రోడ్డుపై బైక్‌ మాదిరిగా నడుపుకోవచ్చు.

అలాగే, ఇందులో ప్లాస్మా జెట్ ఇంజన్‌కు కూడా ఉపయోగించారు. ఇది మోటార్‌సైకిల్‌ను గాలిలో ఎగిరేలా చేసేందుకు సహకరిస్తుంది. గాలిలోకి సులువుగా ఎగిరేందుకు గానూ మూన్‌రైడర్‌ను తేలికపాటి వస్తువులను ఉపయోగించి తయారు చేశారు. మూన్‌రైడర్‌లో ముందు వైపు రెండు చక్రాలు మాత్రమే ఉంటాయి. ఈ చక్రాల్లో ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చబడి ఉంటాయి, ఇవి ఎలక్ట్రిక్ బ్యాటరీల ద్వారా పనిచేస్తాయి. ఈ టూవీలర్‌కు ముందు భాగంలో అమర్చబడిన సోలార్ ప్యానెల్స్ ద్వారా ఇందులోని బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. బాగుంది కదూ ఈ మూన్‌రైడర్ హైబ్రిడ్ ఫ్లయింగ్ మోటార్‌సైకిల్.

More from DriveSpark

Article Published On: Monday, July 2, 2012, 14:43 [IST]
English summary
The MoonRider is a futuristic hybrid two wheeler which can be driven as a motorbike, but also acts as a flying machine. The lightweight motorcycle is an electric-powered bike with zero emission as well a plasma jet engine to provide power in flying mode.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+