రూ.15,990 లకే ఫోర్డ్ ఫిగో యాడ్-ఆన్ యాక్ససరీ ప్యాక్
ప్రస్తుతం ఫోర్డ్ ఇండియాకు లక్కీ ఛార్మ్‌గా మారిన ఫోర్డ్ ఫిగోకు మరిన్ని అదనపు హంగులు జోడించేందుకు గానూ కంపెనీ ఓ సరికొత్త యాడ్-ఆన్ యాక్ససరీ ప్యాకను అందిస్తుంది. ఈ యాక్ససరీ ప్యాక్ ధర కేవలం రూ.15,990లు మాత్రమే. ర్డ్ ఫిగో యాక్ససరీ ప్యాక్‌లో స్పోర్టీ రూఫ్ రెయిల్స్, వినైల్ సీట్ కవర్స్, స్మార్ట్ రియర్ స్పాయిలర్, డోర్ స్కఫ్ ప్లేట్స్, ప్లస్ డెకాల్, క్రోమ్ బాడీ సైడ్ ప్రొటెక్షన్ మోల్డింగ్‌లు ఉంటాయి.
ఈ యీక్ససరీ ప్యాక్‌ను ఆన్‌లోన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఈ యాక్ససరీ ప్యాక్‌ను కొనుగోలుచేసే వారికి 15 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఇంటీరియర్ ట్రీట్‌మెంట్ ప్యాకేజ్‌పై కూడా 50 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇలా ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న ఫోర్డ్ ఫిగో యాక్ససరీ ప్యాక్‌ను కొనుగోలుదారులు తమకు సమీపంలోని డీలర్‌షిప్ కేంద్రాల్లో పొందవచ్చు. ఈ యాక్ససరీ ప్యాక్ ధరలోనే ఫిట్టింగ్ /ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు కలిసి ఉంటాయి.


Click it and Unblock the Notifications









