జిఎమ్ గోగోలింక్‌తో తక్కువ ధరకే నావిగేషన్ సిస్టమ్..!
జనరల్ మోటార్స్ అమెరికా మార్కెట్లో అందిస్తున్న చవకైన చిన్న కార్లు చెవర్లే స్పార్క్ (ఇండియన్ మార్కెట్లో చెవర్లే బీట్), చెవర్లే సోనిక్ ఆర్ఎస్ మోడళ్ల కోసం ఓ ప్రత్యేకమైన నావిగేషన్ యాప్ (అప్లికేషన్)ను కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ కార్లను ఉపయోగించే కస్టమర్లు వెబ్‌సైట్ నుండి ఈ అప్లికేషన్‌ను తమ మొబైల్ ఫోన్లలోకి డౌన్‌లోడ్ చేసుకొని, కారులోని మైలింక్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్‌కు కనెక్ట్ చేయడం ద్వారా పూర్తి నావిగేషన్ ఫంక్షన్‌ను ఇందులో పొందవచ్చు.
ఈ వేసవిలో అమ్ముడు కానున్న 2012 చెవర్లే స్పార్క్, నాలుగో త్రైమాసికంలో విడుదల కానున్న చెవర్లే సోనిక్ ఆర్ఎస్ కాంపాక్ట్ కార్లలో ఈ సిస్టమ్‌ను ఉపయోగించుకోవచ్చని జనరల్ మోటార్స్‌ను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. లండన్‌కు చెందిన ఎన్గిస్ టెక్నాలజీస్ డెవలప్ చేసిన గోగోలింక్ అనే అప్లికేషన్ వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుని పాయింట్-టూ-పాయింట్ రోడ్ మ్యాప్‌ను ఉచిత ట్రాఫిక్ అప్‌డేట్స్‌ను పొందవచ్చు.
ఇంటర్నెట్ ద్వారా ఈ డేటాను ఎప్పటికప్పుడు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇప్పటికే విక్రయించన స్పార్క్ కార్లలో డీలర్ వద్ద చిన్నపాటి మార్పులు చేయించుకున్నట్లయితే ఈ అప్లికేషన్ ఉపయోగించుకోవచ్చని, ఇందుకు అయ్యే ఖర్చు గురించి ఈ ఉత్పత్తిని విడుదల చేసిన తర్వాత వెల్లడిస్తామని జనరల్ మోటార్స్ పేర్కొంది.


Click it and Unblock the Notifications









