అద్భుతాలను చిత్రించే కెమెరా; ఇప్పుడు ఇండియాలోనూ లభ్యం
అద్భుతాలను చేయడమే కాదు, అవి కలకాలం గుర్తుండిపోయేలా వాటిని పదిలమైన జ్ఞాపకాలుగా భద్రపరచుకోవటం కూడా ఎంతో అవసరం. సాధారణ కెమెరాలతో కొన్ని క్లిష్టమైన విన్యాసాలను కెమెరాల్లో బంధించటం కూడా క్లిష్టమైన పనే. అయితే, ఈ గో ప్రో కెమెరాలతో ఎలాంటి క్లిష్టమైన విన్యాసాన్నయినా సరే సునాయాసంగా క్యాప్చ్యూర్ చేయొచ్చు.
ఒకప్పుడు విదేశీయ మార్కెట్లకు మాత్రమే పరిమితమైన ఈ హై డెఫెనిషన్ బుజ్జి కెమెరాలు ప్రస్తుతం భారత మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. కాలిఫోర్నియాకు చెందిన గో ప్రో కంపెనీ తమ మినీ కెమెరాలను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. మోటార్ స్పోర్ట్‌లు, సముద్రంపై సెయిలింగ్, అబ్బురపరచే బైక్ స్టంట్, కార్ టెస్ట్ డ్రైవ్స్, ఇలా అనేక సందర్భాల్లో మరొక వ్యక్తి అవసరం లేకుండా స్పష్టమైన ఫోటోలను, చిత్రాలను ఈ గో ప్రో కెమెరాలలో బంధివచ్చు.
గో ప్రో కెమెరాలతో బంధించిన కొన్ని అద్భుతమైన ఫోటోలను క్రింది ఫోటో ఫీచర్‌లో గమనించవచ్చు.

గో ప్రో సర్ఫింగ్ అడ్వెంచర్

గో ప్రో మోటోక్రాస్ మోటో ఎక్స్ రన్నర్ అడ్వెంచర్

గో ప్రో స్కేటింగ్ అడ్వెంచర్

గో ప్రో ప్రారంభ ధర రూ.21,000/-

గో ప్రో ఆల్ టెర్రైన్ వెహికల్ అడ్వెంచర్

గో ప్రో స్ట్రీట్ బైక్ అడ్వెంచర్

గో ప్రో ఆల్ టెర్రైన్ వెహికల్ అడ్వెంచర్
అరచేతిలో ఇమిడిపోయో ఈ గో ప్రో కెమెరాతో హైడెఫినెషన్ వీడియోలను, ఫోటోలనుతీయొచ్చు. మోటారిస్టులు హెల్మెట్‌పై, కారు విండ్ స్క్రీన్‌పై, సర్ఫింగ్ బోర్డ్‌పై ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ ఈ కెమెరాలను సులువుగా అమర్చుకోవచ్చు. ఈ కెమెరాలను ఫిట్ చేసుకునేందుకు ఓ ప్రత్యేకమైన కిట్ కూడా అందుబాటులో ఉంటుంది. సాధారణంగా టెస్ట్ డ్రైవ్‌లు, వీడియో రివ్యూలను చేసేటప్పు ఇలాంటి కెమెరాలనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
ఈ కెమెరాతో షూట్ చేసే వీడియో స్పష్టమైన ఆడియో క్లారిటీని కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే ఉత్తమమైన స్పోర్ట్స్ కెమెరాలలో గో ప్రో కూడా ఒకటిగా పరిగణిస్తారు. రేస్, స్పోర్ట్స్, అడ్వెంచర్ రైడ్స్ చేసే వారికి ఈ కెమెరా చక్కగా ఉపయోగపడుతుంది. దీనిని ఆపరేట్ చేయటం కూడా చాలా సులువు. చెన్నైకు చెందిన స్టీరియో విజన్ భారత్‌లో ఈ గో ప్రో కెమెరాలను అందిస్తోంది. భారత మార్కెట్లో గో ప్రో కెమెరా ధర రూ.21,000 లుగా ఉంది. ఈ కెమెరాకు సంబంధించిన మరిన్ని వివరాలు గో ప్రో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.


Click it and Unblock the Notifications








