రెండు కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేసిన హ్యార్లీ డేవిడ్‌సన్

అమెరికాకు చెందిన కల్ట్ బైక్‌ల తయారీ సంస్థ హ్యార్లీ డేవిడ్‌సన్ కొత్త సంవత్సరంలో మరో రెండు కొత్త క్రూయిజ్ మోటార్‌సైకిళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రపంచ మార్కెట్లలో హ్యార్లీ డేవిడ్‌సన్ అందిస్తున్న పాపులర్ మోటార్‌సైకిళ్లు స్పోర్ట్‌స్టర్ సెవంటీ టూ, సాఫ్ట్‌టెయిల్ స్లిమ్ బైక్‌లను కంపెనీ ఇండియా మార్కెట్లో విడుదల చేసింది.

హ్యార్లీ డేవిడ్‌సన్ విడుదల చేసిన స్పోర్ట్‌స్టర్ సెవంటీ టూలో 1200సీసీ ఎయిర్ కూల్డ్ వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. దీని బరువు 252 కిలోలు. ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్, బెల్ట్ డ్రైవ్, ఫైవ్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లతో ఇది లభిస్తుంది. అంతేకాకుండా... హ్యార్లీ డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ సెవంటీ టూలో క్యాండీ బిగ్ రెడ్ ఫ్లేక్ పెయింట్ ఫినిష్, క్లాసిక్ "పీనట్" ఫ్యూయెల్ ట్యాంక్, ఓప్ హ్యాంగర్ హ్యాండిల్‌బార్స్, న్యారో వైట్‌వాల్ టైర్స్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇకపోతే హ్యార్లీ డేవిడ్‌సన్ విడుదల చేసిన సాఫ్ట్‌టెయిల్ స్లిమ్ బైక్‌లో 1690సీసీ ఎయిర్ కూల్డ్ వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. దీని బరువు 305 కిలోలు. ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్, సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌‌బాక్స్ సిస్టమ్‌లతో ఇది లభ్యమవుతుంది. ఇంకా ఇందులో హాలీవుడ్ స్టయిల్ ఫ్లాట్ హ్యాండిల్ బార్, స్లాష్ కట్ ఫ్రంట్, రియర్ ఫెండర్, సైడ్ మౌంటెడ్ నెంబర్ ప్లేట్, న్యారో రియర్ టైర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ రెండు మోడళ్ల ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

More from DriveSpark

Article Published On: Saturday, February 4, 2012, 17:13 [IST]
English summary
American cult bike maker Harley Davidson has unveiled two new motorcycles in India, namely Sportster SeventyTwo and Softtail Slim. These new motorcycles will be imported as a completely built unit (CBU) from the USA.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+