స్వంత ఇంజన్లను అభివృద్ధి చేయనున్న హీరో మోటోకార్ప్
ఇప్పటి వరకూ హోండా ఇంజన్లను ఉపయోగిస్తూ వచ్చిన దేశీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇకపై తమ వాహనాల్లో స్వంత ఇంజన్లను అమర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. సాంకేతిక భాగస్వామిగా అమెరికాకు చెందిన ఎరిక్ బ్యూయెల్ మోటార్‌సైకిల్ కంపెనీతో చేతులు కలిపిన హీరో మోటోకార్ప్ ప్రస్తుతం ఆస్ట్రియాకు చెందిన ప్రపంచపు అతిపెద్ద ప్రైవేట్ ఇంజన్ డెవలపర్ ఏవీఎల్‌తో జట్టు కట్టేందుకు సన్నాహాలు చేస్తుంది.
స్వంత ఇంజన్లను అభివృద్ధి చేసేందుకు గానూ ఏవిఎల్‌తో టైఅప్ ఏర్పాటు చేసుకున్నామని, తమ ఆర్ అండ్ డి డివిజన్ నుండి ఇప్పటికే ఓ బృందం ఆస్ట్రియాకు వెళ్లిందని, ఏవిఎల్ ఐటిసి (ఇండియా టెక్నికల్ సెంటర్) సన్నిహిత సహకారంతో గుర్గావ్‌లో తమ బృందం పనిచేస్తుందని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పవన్ ముంజాల్ తెలిపారు.
హీరో మోటోకార్ప్ నుండి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న స్ప్లెండర్, ప్యాషన్ వంటి 100సీసీ బైక్‌ల ఇంజన్‌ల తయారీలో ఏవిఎల్ సాయం అందించనుంది. అలాగే సిబిజెడ్, హంక్ వంటి 150సీసీ బైక్‌లకు ఉపయోగించే ఇంజన్ల తయారీలో కూడా ఏవిఎల్ సాయపడనుంది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ అందిస్తున్న అన్ని ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్న జపాన్ భాగస్వామి హోండా అభివృద్ధి చేసిన ఇంజన్లే.


Click it and Unblock the Notifications









