హీరో ఇగ్నైటర్ 125సీసీ మోటార్‌సైకిల్ ధర రూ.56,747
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ నుంచి మార్కెట్లోకి రానున్న 125సీసీ మోటార్‌సైకిల్ 'హీరో ఇగ్నిటార్' ధరలు లీక్ అయ్యాయి. ఇది రెండు వేరియంట్ల (డ్రమ్ బ్రేక్స్ ప్లస్ సెల్ఫ్ స్టార్ట్, డిస్క్ బ్రేక్స్ ప్లస్ సెల్ఫ్ స్టార్ట్)లో లభ్యం కానుంది. వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
హీరో ఇగ్నైటర్ (డ్రమ్ బ్రేక్స్, సెల్ఫ్ స్టార్ట్) - రూ.56,747
హీరో ఇగ్నైటర్ (డిస్క్ బ్రేక్స్, సెల్ఫ్ స్టార్ట్) - రూ.58,773
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
హోండా నుంచి పాపులర్ అయిన హోండా స్టన్నర్ 125సీసీ బైక్ ఆధారంగా డిజైన్ చేసిన హీరో ఇగ్నైటర్ మంచి పెర్ఫామెన్స్‌తో పాటుగా మెరుగైన మైలేజ్‌ను కూడా ఆఫర్ చేస్తుంది. అయితే, ధర విషయంలో మాత్రం ఇది హోండా స్టన్నర్ కన్నా అధికంగా ఉంటుంది. సెల్ఫ్ స్టార్ట్, డిస్క్ బ్రేక్స్, అల్లాయ్ వీల్స్ ఆప్షన్‌తో లభ్యమయ్యే హోండా సిబిఎఫ్ స్టన్నర్ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధర రూ.56,054 మాత్రమే.
హీరో హోండా జాయింట్ వెంచర్ నుంచి హీరో విడిపోయినప్పటికీ, తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో హీరో ఇప్పటికీ జపనీస్ హోండా ఉత్పత్తులను కలిగి ఉంది. అలాంటి వాటిలో హీరో ఇగ్నైటర్ కూడా ఒకటి. హోండా సిబిఎఫ్ స్టన్నర్‌లో ఉపయోగించిన 124.77సీసీ ఏటిఎఫ్‌టి సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌నే ఇందులో కూడా ఉపయోగించారు. ఇది గరిష్టంగా 11 బిహెచ్‌పిల శక్తిని, 11 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హీరో ఇగ్నైటర్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
హీరో ఇగ్నైటర్ 125సీసీ బైక్‌లో ఉండే ప్రధాన ఫీచర్లు:
* న్యూ జనరేషన్125సీసీ ఏటిఎఫ్‌టి ఇంజన్
* సరికొత్త డిజైన్‌తో కూడిన హెడ్‌ల్యాంప్
* డిజిటల్, అనాలాగ్ కలయికతో కూడిన కాంబో మీటర్ కన్సోల్
* స్టయిలిష్ స్ప్లిట్ సీట్
* డాజ్లింగ్ టెయిల్ ల్యాంప్
* రెండు రంగుల కలయికతో (బాడీ కలర్ ప్లస్ బ్లాక్) కూడిన సైడ్ మిర్రర్స్
* హెడ్‌లైట్ నుంచి ఇంజన్ వరకూ ఉండే క్లాసీ ఫ్రంట్ కౌల్ (ఫ్రండ్ బాడీ ప్యానెల్)
* సర్దుబాటు చేసుకునేందుకు వీలున్న వెనుక సస్పెన్షన్ (రియర్ షాక్అబ్జార్వర్స్)
* బాడీ కలర్‌లో ఉండే రియర్ గ్రిప్
హీరో ఇగ్నైటర్ 125సీసీ బైక్ పెరల్ వైట్, స్పోర్ట్స్ రెడ్, వైబ్రాంట్ బ్లూ, పాంథర్ బ్లాక్ మెటాలిక్ అనే నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications









